Manushi Chiller : రూ.350 కోట్ల సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేసిందా…
మాజీ విశ్వసుందరి (Ex Vishwasundari) మానూషీ చిల్లర్ (Moonushi Chillar) గురించి ప్రత్యేకి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమాతో తెలుగు (Tollywood) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కమర్షియల్ గా సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీ పేరు పెద్దగా లైమ్ లోకి రాలేదు

Did you make a mistake by rejecting a Rs 350 crore film?
మాజీ విశ్వసుందరి (Ex Vishwasundari) మానూషీ చిల్లర్ (Moonushi Chillar) గురించి ప్రత్యేకి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమాతో తెలుగు (Tollywood) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కమర్షియల్ గా సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీ పేరు పెద్దగా లైమ్ లోకి రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ హిందీ భామకు పిచ్చ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మంచి అందాల విందును వడ్డిస్తుంటుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఓ గోల్డెన్ చాన్స్ ను మిస్ చేసుకుంది. అది కూడా సందీప్ రెడ్డి వంగా సినిమా లో. కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సందీప్.. మానూషీ చిల్లర్ నే అనుకున్నాడట. తనను అప్రోచ్ అయితే.. తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మానూషీ చిల్లర్ తెలపడం విశేషం. అయితే ముందుగా తనను షాహిద్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అని తెలియక, వేరే కమిట్‌మెంట్స్ కారణంగా మిస్ చేసుకున్నట్లు రీసెంట్ గా ఈ బ్యూటీ తెలిపింది.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమాతో ఇండస్ట్రీలో ఇచ్చింది. చంద్రప్రకాష్ ద్వివేడి దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా చేసింది. ఇది కూడా డిజాస్టర్ అవడంతో ఈ బ్యూటీకి అవకాశాలే కరువైపోయాయి. రీసెంట్ గా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన రెండో సినిమా.. బడే మియాన్ చోటే మియాన్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలన్నీ టెహ్రాన్ పైనే ఉన్నాయి.