670 కోట్ల మ్యాజిక్ అర్ధమైందా..? తారక మంత్రమే కావాలా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఆల్రెడీ బన్నీ కాపీ కొడుతున్నారనే చర్చ జరుగుతోంది. తన కథ, తన హీరోయిన్, ఆఖరికి తనతో సినిమాలు తీస్తున్న దర్శకులే బన్నీ టార్గెట్ గా మారారనే ఓ డిస్కర్షన్ మొదలైంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఆల్రెడీ బన్నీ కాపీ కొడుతున్నారనే చర్చ జరుగుతోంది. తన కథ, తన హీరోయిన్, ఆఖరికి తనతో సినిమాలు తీస్తున్న దర్శకులే బన్నీ టార్గెట్ గా మారారనే ఓ డిస్కర్షన్ మొదలైంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ని కాపీ కొట్టడం కాదు కాని, తన సలహాలే తీసుకుంటున్నట్టున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఎప్పుడైతే మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడో అప్పటి నుంచి ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి ప్లాపులతో డీలా పడుతూనే ఉన్నాడు. కాబట్టే తారక మంత్రం ఫాలో అవ్వాల్సి వస్తున్నట్టుంది. ఆల్రెడీ తన కథనే చరణ్ కి త్యాగం చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు తన దర్శకుడిని కూడా త్యాగం చేస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ తన లేడీనే చరణ్ కి జోడీగా మార్చారు.. ఇప్పుడు డైరెక్టర్ వంతొచ్చింది.. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి 670 కోట్ల కొల్ల కొట్టిన దేవర, ఇంతకి చరణ్ కి ఇచ్చిన సలహా ఏంటి? చేసిన కొత్త త్యాగమేంటి? హావేలుక్
దేవర మూవీ త్రిబుల్ ఆర్ తో పోలిస్తే అందులో సగమే రాబట్టి ఉండొచ్చు.. కాని ఇది మాత్రం బన్నీ, చరణ్ ఇలా పాన్ ఇండియా హిట్ల వేటలో ఉన్న హీరోలందరిన మెదడు తొలిచేస్తున్నమూవీ. అసలు త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కి దేవరతో ప్లాప్ పడుతుందనే ప్రిడిక్షన్స్ వినిపించాయి. ఎలాగూ చరణ్ కి ఆచార్యతో ప్లాప్ పడింది… తారక్ కి దేవరతో డిజాస్టర్ పడుతుందనే కామెంట్లే వచ్చాయి.
కట్చేస్తే ఆ సినిమా హిట్టైంది. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన రికార్డు ఎన్టీఆర్ కి దక్కింది. అంతకుమించి నార్త్ ఇండియానుంచే 350 కోట్లు వసూళ్లు రావటంతో, ఆ తారక మంత్రమే కావాలనే ఫోకస్ బన్నీ, చరణ్ లో కనిపిస్తోంది.. కొత్తగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో స్టోరీ డిస్కర్షన్ జరిగింది.
విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ తను చేయాల్సిన కథే, చరణ్ దగ్గరికి పంపించాడు. అలా బుచ్చి బాబు మేకింగ్ లో రామ్ చరణ్ ఇంతవరకు ఎవరూ వేయని క్రికెట్ కూలీ పాత్ర వేస్తున్నాడు. టైటిల్ పెద్ది నుంచి కిట్టు వరకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే, తారక్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ తో చరణ్ కథా చర్చాలే షాకింగ్ న్యూస్ గా మారుతున్నాయి.
ఆల్రెడీ ఎన్టీఆర్ తో జోడీ కట్టిన జాన్వీతోనే బుచ్చి బాబుమూవీలో చరణ్ జోడీ కట్టాడు. ఎన్టీఆర్ తనకి రెఫర్ చేసిన కథనే, చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ని డ్రాగన్ గా మారుస్తున్న ప్రశాంత్ నీల్ తో కథ చర్చలు జరిపాడు.నిజానికి ఎన్టీఆర్ కథలు, హీరోయిన్ తోపాటు దర్శకుల మీద బన్నీ ఎప్పటి నుంచో కన్నేశాడు. ప్రశాంత్ నీల్ ని కలిశాడు కూడా. ఆట్లీ మేకింగ్ లో జాన్వీతో జోడీ కడుతున్నాడని ప్రచారం జరుగతోంది. మరి ప్రశాంత్ నీల్ ని బన్నీ ఎక్కడ ఎగరేసుకుపోతాడేమో అని, చరణ్ తొందరపడ్డాడో, ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ సాయం తీసుకున్నాడో కాని, ఈ వారమే ప్రశాంత్ నీల్ తో చరణ్ మీటింగ్ జరిగింది.
ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తీసి తర్వాత సలార్ 2తో బిజీ అవుతాడు. ఈలోపు పెద్ది మూవీతోపాటు, సుకుమార్ సినిమా చేసి, ప్రశాంత్ నీల్ ఫ్రీ అయ్యే టైంకి చరణ్ ఫ్రీ అవుతాడనంటున్నారు. సో ఎలా చూసినా అన్ని విషయాల్లో స్నేహితుడు ఎన్టీఆర్ దారిలో నడవటమే కాదు, తన సలహాలు, తనదగ్గరికి తారక్ పంపించే కథలని కూడా హై ప్రయారిటీ ఇస్తున్నట్టున్నాడు చరణ్.