మైత్రీపై కేసు వెనుక దిల్ రాజు…? సోషల్ మీడియాలో కొత్త కాంట్రవర్సీ
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు అసలు ఏం చేయబోతున్నారు అనేదానిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ సస్పెన్షన్ నెలకొంది. దాదాపు 20 రోజుల నుంచి వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు అసలు ఏం చేయబోతున్నారు అనేదానిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ సస్పెన్షన్ నెలకొంది. దాదాపు 20 రోజుల నుంచి వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. చివరకు అల్లు అర్జున్ ను రెండుసార్లు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా తొక్కించింది. ఇక ఈ వ్యవహారంలో త్వరలోనే కీలక అరెస్టులు ఉండే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేశారు… చిక్కడపల్లి పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు ఫైల్ అయింది.
ఇక ఈ వ్యవహారంలో త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ను కూడా అరెస్టు చేశారు కాబట్టి తమను కూడా ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయం వారిని వెంటాడుతుంది. దీనితో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు. ఇప్పటికే గాయపడిన చిన్నారికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ కేసు నుంచి బయటకు రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే థియేటర్ పరిసరాల్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు లేరు. కానీ సినిమా నిర్మాణ సంస్థ కాబట్టి వారిపై కూడా కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇక ఒకటి రెండు రోజుల్లో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతోంది. మంగళవారం అల్లు అర్జున్ దాదాపు 3 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ కు సంధించారు. ఆ తర్వాతనే మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు నమోదు అయింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ తర్వాత ఈ కేసు నమోదు కావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ కు దిల్ రాజుకు మధ్య వివాదం నడుస్తోంది. పుష్ప సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ పై దిల్ రాజు సీరియస్ గా ఉన్నారు. నైజాం ఏరియాలో థియేటర్లో అన్ని వాళ్లే లాక్కున్నారు అనే కోపం కూడా దిల్ రాజులో ఉంది. మరి ఈ కేసులో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలను ఎంతవరకు విచారిస్తారు అనేది క్లారిటీ రావాలి. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులు లేకుండానే జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే నిర్మాణ సంస్థ విషయంలో ఏం చేయాలనే దానిపై పోలీసులు లాయర్లతో చర్చిస్తున్నారు. సమస్యలు ఎదుర్కోకుండా ఉండే విధంగానే ఈ కేసులో ముందుకు వెళ్తున్నారు పోలీసులు. ఇక అల్లు అర్జున్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం.