Salaar: సలార్‌కు డిమాండ్ పెరిగింది.. అదే తలనొప్పైంది..?

ఈ సినిమా నైజాం రైట్స్ ఏకంగా రూ.90 కోట్లు కోట్ చేస్తోందట నిర్మాణ సంస్థ హోంబలే. అక్కడే దిల్ రాజుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ కంగారు పడాల్సి వచ్చింది. అసలే బాహుబలి కటౌట్ ప్రభాస్, కేజియఫ్‌తో ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. వీళ్ల కాంబినేషన్‌లో సినిమా అంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 05:48 PMLast Updated on: Aug 29, 2023 | 5:48 PM

Dil Raju Gets Nizam Distribution Rights Of Prabhas Starrer Salaar For Rs 80 Crore

Salaar: సలార్ మూవీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. షూటింగ్ ఆగిందనో, లేదంటే రిలీజ్ వాయిదా అనో, కాదంటే ఫైనల్ కాపీ క్వాలిటీ బాలేదనో సమస్య వస్తే అనుకోవచ్చు. కాని సలార్ ఫైనల్ ఔట్ పుట్ అదిరిపోయింది. దీనికి తోడు సలార్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం, ఏరియా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూకడుతున్నారు. అలాంటప్పుడు సలార్‌కు సమస్య ఏంటనే ప్రశ్న తలెత్తటం కామన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే సలార్ రైట్స్ అమ్మకమే తలనొప్పైందట.

ఈ సినిమా నైజాం రైట్స్ ఏకంగా రూ.90 కోట్లు కోట్ చేస్తోందట నిర్మాణ సంస్థ హోంబలే. అక్కడే దిల్ రాజుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ కంగారు పడాల్సి వచ్చింది. అసలే బాహుబలి కటౌట్ ప్రభాస్, కేజియఫ్‌తో ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. వీళ్ల కాంబినేషన్‌లో సినిమా అంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి. దానికి తగ్గట్టే హోంబలే సంస్థ భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే కేవలం నైజాం రైట్స్ రూ.90 కోట్లని నిర్మాతలు ఫిక్స్ అవటంతో దిల్ రాజు షాకయ్యాడట. తను రూ.65 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్, రూ.15 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ మొత్తంగా 80 కోట్లు కోట్ చేశాడట. కాని నిర్మాతలు మాత్రం రూ.90 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అడగటంతో ఏంచేయాలో దిల్ రాజుకి తెలియట్లేదట. నాన్ రిఫండబుల్ లేదంటే నాన్ రిటర్నబుల్ అంటే తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని అర్ధం.

ఆదిపురుష్ ఫ్లాపైనా కూడా నైజాంలో 35 కోట్లొచ్చాయి. అలాంటిది ప్రశాంత్ నీల్, ప్రభాస్‌లాంటి క్రేజీ కాంబినేషన్ మూవీకి రూ.90 కోట్లు చిన్న మ్యాటరే అంటున్నారట సలార్ నిర్మాతలు. కాని కేవలం ఒక్క నైజాం రైట్సే రూ.90 కోట్లంటే.. ఏపీ, నార్త్ ఇండియా రైట్స్ పరిస్థితేంటి? అక్కడే బ్రేకులు పడుతున్నాయి. ఇంకా డీల్ తాలూకు చర్చలు జరుగుతున్నాయి. అందుకే సరిగా ప్రమోషన్ కూడా షురూ చేయలేదు ఫిల్మ్ టీం.