‘Hanuman’ : ‘హనుమాన్‌’ని దెబ్బ తీయబోతున్న దిల్‌రాజు..?

ఈసారి గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్‌, ఈగిల్‌, హనుమాన్‌.. ఇలా ఐదు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్‌, జనవరి 13న సైంధవ్‌, ఈగిల్‌, జనవరి 14న నా సామిరంగ విడుదల కాబోతున్నాయి. ఒకే సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చేసుకునేందుకు రిలీజ్‌లను కాస్త వెనక్కి ముందుకు జరపడం జరుగుతూ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2024 | 01:28 PMLast Updated on: Jan 04, 2024 | 1:29 PM

Dil Raju Is Going To Hit Hanuman

సంక్రాంతి పండగ అంటే అందరికీ వినోదం కావాలి. అది సినిమాల ద్వారా కావచ్చు, కోడి పందాలు కావచ్చు. ఎవరికి తోచిన ఆనందాన్ని వారు వెతుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా అందరి దృష్టీ సినిమాలపైనే ఉంటుంది. అందుకే ప్రతి సంక్రాంతికి మినిమం నాలుగైదు పెద్ద సినిమాలు రిలీజ్‌కి ఉంటాయి.

ఈసారి గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్‌, ఈగిల్‌, హనుమాన్‌.. ఇలా ఐదు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్‌, జనవరి 13న సైంధవ్‌, ఈగిల్‌, జనవరి 14న నా సామిరంగ విడుదల కాబోతున్నాయి. ఒకే సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చేసుకునేందుకు రిలీజ్‌లను కాస్త వెనక్కి ముందుకు జరపడం జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి మాత్రం అది చాలా క్లిష్టతరమైపోయింది. దీనికి సంబంధించిన దిల్‌రాజు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగాయి.

అయితే రిలీజ్‌ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ హనుమాన్‌ మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో దిల్‌రాజు ఒక పథకాన్ని రచించాడు. గుంటూరు కారం చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను దిల్‌రాజు తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 12న గుంటూరు కారంతోపాటు హనుమాన్‌ కూడా రిలీజ్‌ అవుతోంది. అందుకే హనుమాన్‌ను దెబ్బతీసేందుకు నైజాంలో 95 శాతం థియేటర్లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించారు. హైదరాబాద్‌లో 96 సింగిల్‌ స్క్రీన్‌లు ఉండగా అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. హనుమాన్‌ చిత్రానికి నాలుగైదు థియేటర్లే కేటాయించారని తెలుస్తోంది. దిల్‌రాజు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హనుమాన్‌ చిత్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.