లేడీ ఐటి ఆఫీసర్ పై దిల్ రాజు సీరియస్, కోపం పట్టలేక ఫోన్ విసిరేసాడు…?

మూడు రోజుల నుంచి సినిమా వాళ్లకు ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు డైరెక్టర్లపై ఐటి దాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలపై జరుగుతున్న ఐటీ దాడులు సెన్సేషన్ అవుతున్నాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 06:30 PMLast Updated on: Jan 24, 2025 | 6:30 PM

Dil Raju Is Serious About The Lady It Officer He Cant Get Angry And Throws The Phone

మూడు రోజుల నుంచి సినిమా వాళ్లకు ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు డైరెక్టర్లపై ఐటి దాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలపై జరుగుతున్న ఐటీ దాడులు సెన్సేషన్ అవుతున్నాయి. మంగళవారం మొదలైన ఈ సోదాలు గురువారం కూడా కొనసాగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అయింది.

అలాగే వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా సంక్రాంతి వస్తున్నాం అనే సినిమాను కూడా దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇక డిసెంబర్ తొలి వారం అల్లు అర్జున్.. పుష్ప 2 సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపాయి. దీంతో నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఐటి అధికారులు రైడ్స్ చేశారు. ఏకకాలంలో 55 బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. అయితే దిల్ రాజు నివాసంలో తనిఖీలపై అధికారులు ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన భార్య తేజస్వినిని ఐటి శాఖ అధికారులు స్వయంగా బ్యాంకుకు తీసుకువెళ్లారు. బ్యాంకు ఖాతాలతో పాటుగా లాకర్లను ఆమెతో ఐటీ అధికారులు స్వయంగా ఓపెన్ చేయించారు. దిల్ రాజు నివాసంలో ఐటి శాఖ అధికారులు మరికొన్ని రోజులు సోదాలు నిర్వహించనున్నారు అని ఓ ప్రచారం జరుగుతోంది… దిల్ రాజు నివాసంలో కీలక పత్రాల విషయంలో స్పష్టత రాకపోవడం అలాగే కొన్ని సినిమాలకు సంబంధించిన లెక్కలు తారుమారు కావడం పై ఐటి అధికారులు దృష్టి సారించారు.

దీనితో దిల్ రాజుకి భారీగా ఫైన్ పడే అవకాశం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మూడో రోజు సాదాల సందర్భంగా డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న మహిళ అధికారితో దిల్ రాజు వాదనకు దిగారు. దీనితో సదరు మహిళా అధికారి అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో దిల్ రాజు సీరియస్ గా అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ కూడా విసిరేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో దిల్ రాజు ఆగ్రహానికి గురై ఆ విధంగా ప్రవర్తించారని సమాచారం.

ఇక మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లపై కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టి రెండు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే సుకుమార్ సన్నిహితులు, బంధువుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. త్వరలోనే అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులకు దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.