DIL RAJU: దిల్ రాజుకేమైంది..? ఆయన జడ్జిమెంట్ గురి తప్పుతోందా..?
ఎందుకో గత ఆరు ఏళ్లుగా ఆయన జడ్జిమెంట్ గురి తప్పుతోంది. 2018 నుంచి 2024 వరకు దిల్ రాజు 16 సినిమాలు నిర్మించాడు. అందులో ఎఫ్ 2, బలగం, వకీల్ సాబ్ మాత్రమే హిట్లు. మిగతా వాటిలో ఎఫ్ 3, హలో గురు ప్రేమకోసమే జస్ట్ యావరేజ్‌లుగానే నిలిచాయి.
DIL RAJU: దిల్ రాజు నిర్మాతగా పట్టిందల్లా బంగారం అవుతుందంటారు. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న అనుభవం వల్ల సినిమా రిలీజ్‌కి ముందే తీర్పు చెప్పే సత్తా ఉన్న నిర్మాత అంటారు. నిజంగానే 70 శాతం సక్సెస్ రేటున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. కాని ఎందుకో గత ఆరు ఏళ్లుగా ఆయన జడ్జిమెంట్ గురి తప్పుతోంది. 2018 నుంచి 2024 వరకు దిల్ రాజు 16 సినిమాలు నిర్మించాడు. అందులో ఎఫ్ 2, బలగం, వకీల్ సాబ్ మాత్రమే హిట్లు.
Sonu Sood: దొంగకు సోనూసూద్ సాయం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
మిగతా వాటిలో ఎఫ్ 3, హలో గురు ప్రేమకోసమే జస్ట్ యావరేజ్‌లుగానే నిలిచాయి. నాని వీ ఓటీటలో వచ్చినా హిట్ టాకేం రాలేదు. కాబట్టి, మూడు హిట్లు, మూడు యావరేజ్‌లు తీసేస్తే, మిగతావన్నీ ఫ్లాపులే. థ్యాంక్యూ, శాకుంతలం, శ్రీనివాస కళ్యాణం, జాను, వారసుడు, ఫ్యామిలీ స్టార్ పూర్తిగా డిజాస్టర్లుగా నలిచాయి. తన తమ్ముడి కొడుకుతో తీసిన రౌడీ బోయ్స్ కూడా జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
వెంకటేష్‌తో అనిల్ రావిపుడి తీయబోయే ట్రయాంగిల్ క్రైమ్ కహానీ మీదే అంచనాలు పెంచుకున్నాడు. మొత్తంగా శంకర్ గేమ్ ఛేంజర్ లాంటి సాహసాన్ని పక్కన పెడితే వెంకీతో, నితిన్ తమ్ముడు మూవీతో దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.