పుష్పకు సైలెంట్ స్ట్రోక్ ఇచ్చిన దిల్ రాజు, గేమ్ చేంజర్ టికెట్ ధర పెంచడం లేదు…
మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. అందరి సపోర్ట్ తో వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ అయ్యా అంటూ బన్నీ కలరింగ్ ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్న్స్ ఫైర్ అవుతున్నారు.
మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. అందరి సపోర్ట్ తో వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ అయ్యా అంటూ బన్నీ కలరింగ్ ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్న్స్ ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా… దీనిపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు. ఏ సాంగ్ రిలీజ్ చేసినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ట్రోలింగ్ తో.
ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా… పుష్ప రిలీజ్ అయినన 35 రోజుల తర్వాత రిలీజ్ కానుంది. ఈ సినిమాను దిల్ రాజు ఏ మాత్రం రాజీ పడకుండా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సాంగ్స్ కోసమే వంద కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పుష్ప కంటే బడ్జెట్ తక్కువే అయినా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
సినిమా టికెట్ రేట్స్ ను అసలు పెంచవద్దని… కేవలం బెనిఫిట్ షోస్ మాత్రమే పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పెంచినా కేవలం ఒక రోజు మాత్రమే పెంచిన ధరలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణాలో పుష్ప 2 టికెట్ ధరలను భారీగా పెంచడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్ళాలి అంటే దాదాపు ఆరు వేలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. బెనిఫిట్ షో టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. కొన్ని చోట్ల వెయ్యి రూపాయల వరకు టికెట్ రేట్ ఉండటం పట్ల సీరియస్ గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా.
మల్టీ ప్లెక్స్ లో ఏకంగా 550 పైగా టికెట్ రేట్ ఉంది. దీనితో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు మెగా ఫ్యాన్స్. ఈ టైం లో గేమ్ చేంజర్ టికెట్ రేట్స్ విషయంలో కక్కుర్తి పడకుండా ఉంటే కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయంలో దిల్ రాజు ఏ మాత్రం భయపడటం లేదట. మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఇదే జరిగితే మాత్రం గేమ్ చేంజర్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.