DIL RAJU: దిల్ రాజుకు ఎంపీ టికెట్ కన్ఫార్మ్! పోటీ ఆ పార్టీ నుంచే..
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నిజానికి ఆయనకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయ్. దీంతో ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది.
DIL RAJU: సినిమాలకు, రాజకీయాలకు తెలియని ఓ అనుబంధం ఉంటుంది. అన్నగారు ఎన్టీఆర్ నుంచి చిరు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వరకు.. సినిమాల్లో సక్సెస్ అయి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది. హీరోలే కాదు.. దర్శకులు, నిర్మాతలు కూడా రాజకీయాల్లో రాణించారు. దాసరిలాంటి వారు కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు. ఐతే ఇప్పుడు మరో నిర్మాత.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
Chiranjeevi: విలన్ దొరికేశాడు.. ‘విశ్వంభర’ విలన్ రానా కాదా..!
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నిజానికి ఆయనకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయ్. దీంతో ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని హస్తం పార్టీ భావించినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉండటంతో దిల్ రాజు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అటు సీనియర్లు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా.. నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఈ మధ్య నిజామాబాద్ అర్బన్ నుంచి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లు కూడా నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఐతే ఇప్పుడు దిల్ రాజుకు టికెట్ కేటాయిస్తే.. పార్టీలో అసంతృప్తి మొదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయ్.
నిజానికి టీఎఫ్‌సీసీ ఎన్నికల సమయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ ఎంట్రీపై పెద్దఎత్తున చర్చకు దారితీశాయ్. తాను ఏ పార్టీ తరఫున నిల్చున్నా గెలుస్తానని.. ఐతే రాజకీయాల్లో ఉన్నా.. తన మొదటి ప్రాధాన్యం సినిమాలకే అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అయ్యాయ్. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనను ఢీకొట్టాలంటే ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్న లీడర్ కావాలని సెర్చ్ చేస్తున్న కాంగ్రెస్.. దిల్ రాజు వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.