దిల్ రాజు మామూలోడు కాదు, రేవంత్ ను సెట్ చేసేసుకున్నాడు

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా... సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు అనే క్లారిటీ చాలామందికి వచ్చేసింది. అందుకే సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు తమ సినిమాలకు బెనిఫిట్ షోలు అడిగే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2024 | 05:15 PMLast Updated on: Dec 21, 2024 | 5:15 PM

Dil Raju Will Get Benifit Shows For Game Changer

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా… సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు అనే క్లారిటీ చాలామందికి వచ్చేసింది. అందుకే సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు తమ సినిమాలకు బెనిఫిట్ షోలు అడిగే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఒక మహిళ ప్రాణాలకు కోల్పోవడం మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటంలో తెలంగాణలో సినిమా పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉండటంతో ఈ వ్యవహారం అల్లు అర్జున్ అరెస్టు వరకు వెళ్లిందని చెప్పాలి.

అయితే రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా విషయంలో దిల్ రాజు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు ఉండే ఛాన్స్ లేదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. దీంతో తెలంగాణలో కచ్చితంగా పాన్ ఇండియా సినిమాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ విషయంలో రేవంత్ రెడ్డిని సెట్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.

టాలీవుడ్ కు ప్రభుత్వానికి మధ్య వారధిలా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరిస్తుందని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన సినిమా గేమ్ చేంజెర్ విషయంలో దిల్ రాజు… బెనిఫిట్ షోస్, అలాగే టికెట్ రేట్లను కూడా ఆయన పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. టికెట్ రేట్లు పుష్ప 2 రేంజ్ లో భారీగా పెంచకుండా కొంతవరకు పెంచే విధంగా రేవంత్ రెడ్డిని ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా గేమ్ చేంజెర్ సినిమాకు బెనిఫిట్ షోలో ఉంటాయని అనౌన్స్ చేసాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నామని కూడా ఒక ప్రకటన చేశాడు. ఇక సంక్రాంతి వస్తున్న చిత్రాలు తనవే అని గేమ్ చేంజెర్, సంక్రాంతి వస్తున్నాం… తన హోమ్ బ్యానర్ లోనే చేశామని డాకు మహారాజ్ సితార బ్యానర్ లో వస్తుందని ఈ మూడు సినిమాలకు తన నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని దిల్ రాజు ప్రకటించాడు. ఇక గేమ్ చేంజర్ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్రమోట్ చేయడానికి రెడీ అయిన దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ ఇప్పుడు డల్లాస్ వెళ్లారు. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు. అమెరికాలోనే ఒక పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అదే పాట ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.