ఎన్టీఆర్ డైరెక్టర్ కోసం.. దిల్ రాజు సాయం..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఎవరు సినిమాలు తీస్తు వాళ్లే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ అనే అభిప్రాయం పెరిగిపోయింది. దేవర తీసిన కొరటాల శివని తను లైన్లో పెట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 07:50 PMLast Updated on: Mar 12, 2025 | 7:50 PM

Dil Rajus Help For Ntrs Director

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఎవరు సినిమాలు తీస్తు వాళ్లే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ అనే అభిప్రాయం పెరిగిపోయింది. దేవర తీసిన కొరటాల శివని తను లైన్లో పెట్టాడు. ఎన్టీఆర్ తో జోడీ కట్టిన జాన్వీ కపూర్ తో బన్నీ జోడీ కట్టబోతున్నాడు. కాకపోతే ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీలే ఎందుకో బన్నీకి అనుకూలంగా లేడట. ఎందుకు? తను రీసెంట్ గా బన్నీకి ఓ స్టోరీ లైన్ చెప్పాడని కూడా ప్రచారం జరిగింది. అయినా తను ఎందుకు ఐకాన్ స్టార్ ఆఫర్ ని ఒప్పుకోవట్లేదు… ఈ డౌట్ తేలేలోపే బన్నీ చాలా పెద్ద స్కెచ్చే వేశాడు.. దిల్ రాజుని రంగంలోకి దింపాడు… టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బన్నీ సినిమా ఓకే అయ్యేలా చక్రం తిప్పుతున్నాడని తెలుస్తోంది. ఈవిషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా బన్నీకి సపోర్ట్ గానే హెల్ప్ చేశాడనే టాక్ వచ్చింది. అయినా దిల్ రాజుని రంగంలో దింపటంలో బన్నీ మతలబు ఏంటి? ఎందుకు ఎన్టీఆర్ డైరెక్టరే కావాలని ఇంతగా బన్నీ పట్టుపడుతున్నాడు? టేకేలుక్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దర్శకులు దొరక్కే పాన్ ఇండియా డైరెక్టర్స్ కోసం మొన్న ఎన్టీఆర్ తో స్నేహాన్ని వాడారన్నారు. తర్వాత తానే రంగంలోకి దిగి కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడన్నారు. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సాయం తో ప్రశాంత్ నీల్ ని ట్రాక్ లోకి లాగుతున్నాడట..నిజానికి పుష్ప, పుష్ప2 రెండు సినిమా లు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఏదో మలయాళంలో, తమిళ్ లో ఈ సినిమాలు ఫెల్యూర్ ఫేస్ చేయొచ్చు కాని, ట్రెండ్ సెట్ చేశాయి. 1850 కోట్లతో సీక్వెల్ కూడా దుమ్ముదులిపింది. ఆ వసూళ్ల మీద వంద అనుమానాలున్నా, అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాక నమ్మాల్సిందే.. తప్పదు.. ఇంకో మార్గంలేదు..

సరే అది అటుంచితే, బన్నీ మంచి నటుడే, పుష్పతో పాన్ ఇండియా మాస్ ఇమేజ్ కూడా వచ్చింది. అలాంటి తనతో సినిమాలు తీయాలని పాన్ ఇండియా డైరెక్టర్లకు ఉండటం సహజం. కాని తన దురద్రుష్టం ఎలా ఉందంటే, సాలిడ్ హిట్లు, పాన్ ఇండియా లెవల్లో అభిమానుల ఫాలోయింగ్ ఉన్నా, తనకి తన స్థాయిని పెంచే దర్శకులు కరువొచ్చింది.ఎందుకంటే కేజీయఫ్, సలార్ ఫేం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. తర్వాత సలార్ సీక్వెల్ తీయబోతున్నాడు. ఆవెంటనే కేజీయఫ్ మూడో భాగం ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్, తర్వాత యానిమల్ సీక్వెల్, ఆతర్వాత ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.ఇక రాజమౌళి విషయానికొస్తే మరో మూడేళ్లవరకు తను కాలీగా ఉండడు..తర్వాత కూడా బన్నీతో మూవీతీస్తాడని చెప్పలేం కాని, మూడేళ్ల వరకు తను బ్లాక్.

తమిల్ ఆట్లి గొంతమ్మె కోర్కెలు బన్నీని భయపెడుతుంటే, చేతిలో త్రివిక్రమ్ ఉన్నా తన మీద నమ్మకం లేదు. అందుకే ఆరునెల్లు రెస్ట్ తీస్కో బాసు అని తనని హోల్డ్ లో పెట్టాడు. సో అర్జెంట్ గా బన్నీకి పాన్ ఇండియా డైరెక్టర్ కావలి.అందుకే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ని లైన్ లో పెట్టాడు. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. కాని దేవర 2 తీసే వరకు కొరటాల శివ వచ్చి బన్నీతో సినిమా తీయడు.. కాకపోతే ప్రశాంత్ నీలే వొత్తిడి చేస్తే ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ డ్రాగన్ తీస్తున్నాడు కాబట్టి, తన సినిమా ఆగస్ట్ లోగా పూర్తైతే, సలార్ 2 కాకుండా తనతో సినిమా తీయించేలా ప్లాన్ చేయొచ్చు .అందుకే దిల్ రాజుని రంగంలోకి దింపి ఎన్టీఆర్ దర్శకుడిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ తనతో జోడీకట్టిన జాన్వీని ఆట్లి మూవీకోసం లాగేస్తున్నాడనంటున్నారు… సో మొత్తానికి ఎన్టీఆరే బన్నీ కోసం ప్రశాంత్ నీల్ ని పురమాయిస్తే, తను స్టోరీ లైన్ చెప్పటం జరిగిందన్నారు. కాని ఇమీడియట్ గా ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశం లేకపోవటం వల్లే, దిల్ రాజుని సీన్ లోకి తీసుకొచ్చిన బన్నీ అనంటున్నారు.