దిల్ రాజును నాకేసిన శంకర్, దీనెమ్మ ఒక్క సాంగ్ కోసం అన్ని కోట్లా…?
మెగా అభిమానులు పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరో సినిమా రానుంది.
మెగా అభిమానులు పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరో సినిమా రానుంది. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ జనాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయారు.
ఇక ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సింది రాంచరణ్, మహేష్ బాబు మాత్రమే. మహేష్ బాబుకు రాజమౌళి సినిమా లైన్ లో ఉంది. దీనితో రామ్ చరణ్ కోసం మెగా అభిమానులు ఎంతో భారీ అంచనాలతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఈవెంట్ ను ఈనెల 21న అమెరికాలో నిర్వహించనున్నారు మేకర్స్. దీనికి డైరెక్టర్ సుకుమార్ ను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కూడా రాజీపడటం లేదు.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి నానా హైరానా అనే పాట రిలీజ్ అయింది. ఆ పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 47 మిలియన్ వ్యూస్ ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీలో కలిపి సొంతం చేసుకుంది. ఈ పాట మెలోడీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇక ఈ పాట షూటింగ్ విశేషాలు తాజాగా బయటకు వచ్చాయి. న్యూజిలాండ్ లో ఆరు రోజులు పాటు షూటింగ్ జరిగింది. ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాను వినియోగించారట. దాదాపు ఈ సాంగ్ కోసమే 10 కోట్ల బడ్జెట్ ను నిర్మాత దిల్ రాజు ఖర్చు చేశారట.
తమన్ సంగీతం అందించగా రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇక ఈ సాంగ్ ను కార్తీక్, శ్రేయ ఘోషల్ ఇద్దరు కలిపి పాడారు. ఇక పొలిటికల్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్. అంజలి, ఎస్జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరో 30 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచేసింది. ఈ సినిమా ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తోంది ఈ సినిమా హిట్ కొడితే మెగా ఫాన్స్… చాలామందికి ఆన్సర్ చెప్పొచ్చని ఎదురుచూస్తున్నారు.