Ram Potineni: డబుల్ ఇస్మార్ట్‌గా వచ్చేస్తున్న రామ్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. డబుల్ ఇస్మార్ట్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Directed by Purijagannath and starring Ram Pothineni as the hero, Double Smart is all set for release
పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమాకు పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం అటు పూరీ జగన్నాథ్, ఇటు రామ్ ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. లైగర్ చేసిన గాయం నుంచి బయటపడేందుకు పూరీ జగన్నాథ్, మంచి హిట్‌తో కంబ్యాక్ అయ్యేందుకు రామ్ ప్రయత్నిస్తున్నారు. దీంతో బ్లాక్‌స్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌నే ఇద్దరూ నమ్ముకున్నారు. మొన్నటి వరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు పూరీ.
దీంతో అంతా ఇక సినిమా రాదు అనుకున్నారు. కానీ రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న స్కంధ సినిమా కారణంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేట్ అయ్యింది. రీసెంట్‌గానే ఆ సినిమా పూర్తవడంతో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడు పూరీ. రీసెంట్‌గానే పూజా కార్యక్రమం పూర్తి చేశారు. ఇప్పుడు రామ్ కూడా లుక్ మార్చి ఇస్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసే చాన్స్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. రామ్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ ఆ తరువాత పూరీకి, రామ్‌కు ఇద్దరికీ పెద్దగా హిట్స్ లేవు. దీంతో ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ఇద్దరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వీళ్లిద్దరికీ డబుల్ ఇస్మార్ట్ డబుల్ కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.