డైరెక్టర్ బాలయ్య, కొడుకుతో డ్రీం ప్రాజెక్ట్ డైరెక్షన్ కు రెడీ

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే విషయంలో చాలా పక్కా లెక్కల తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ సినిమా ఫైనల్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 08:26 PMLast Updated on: Dec 05, 2024 | 8:26 PM

Director Balayya Is Ready To Direct A Dream Project With His Son

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే విషయంలో చాలా పక్కా లెక్కల తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ సినిమా ఫైనల్ అయింది. డిసెంబర్ 10 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయిలో సెట్స్ పైకి వెళ్లకుండానే మరో రెండు సినిమాలకు మోక్షజ్ఞ సైన్ చేయడం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో నందమూరి మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడు అంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి.

బాలయ్యకు ఆ కథ బాగా నచ్చటంతో వెంటనే సినిమాను ఓకే చేసినట్టుగా టాక్. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిన తర్వాత ఆ సినిమాను మొదలు పెడతారా లేకపోతే ఈ సినిమా మధ్యలోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త హీరో కాబట్టి రిస్కు చేసే అవకాశం ఉండకపోవచ్చు అని ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మరో స్టెప్పు వేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 ను తానే స్వయంగా డైరెక్ట్ చేయనున్నారట. అలాగే ఆ సినిమాకు నిర్మాతగా కూడా బాలకృష్ణ వ్యవహరించనున్నారు.

ఆదిత్య 369 సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. ఎప్పటినుంచో ఈ సినిమాపై బాలకృష్ణ కామెంట్ చేస్తూ వస్తున్నా… ఇప్పటికి ఆయన తన కొడుకును హీరోగా పెట్టి తన కోరిక నెరవేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని గతంలో బాలకృష్ణ ఎన్నో సార్లు చెప్పారు. ఇప్పుడు చెప్పినట్టుగానే తన కొడుకుని డైరెక్ట్ చేయనున్నారు. తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్తాపబుల్ షోలో బాలకృష్ణ ఇదే సినిమాలో తాను వేయబోయే వేషానికి సంబంధించి లుక్ క్లారిటీ ఇచ్చారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆయన ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారని… అలాగే మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటారని టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఎలా ఉన్నా దాదాపు ఏడు పదుల వయసులో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాను డైరెక్ట్ చేయాలి అనుకుని బాలయ్య ముందడుగు వేయడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఈ ఆదిత్య 369 సీక్వెల్ బాలయ్య ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాలి. ప్రస్తుతం బాలయ్య బాబి డైరెక్షన్లో డాకూ మహారాజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది ఈ సినిమా తర్వాత అఖండ సీక్వెల్లో బాలయ్య నటిస్తారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.