Devara: ఎన్టీఆర్‌కు పోటీగా కేజీఎఫ్‌ యాక్టర్స్‌ను దింపుతున్న కొరటాల

కేజీఎఫ్‌ సినిమాలో విలన్స్‌ బ్యాచ్‌కి హెల్పర్‌ రోల్‌ చేసిన తారక్‌ పొన్నప్పను దేవర సినిమాలో ఓ కీ రోల్‌ కోసం తీసుకుంటున్నాడట కొరటాల. సినిమాలో తారక్‌ పొన్నప్ప రోల్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుందట. కథను పూర్తిగా మలుపు తిప్పే పాత్రలో తారక్‌ పొన్నప్ప కనిపించబోతున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 06:19 PMLast Updated on: May 27, 2023 | 6:19 PM

Director Koratala Siva Roped Kgf Actor In For Ntrs Devara

Devara: ఎన్టీఆర్‌ 30 సినిమా నుంచి రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. రీసెంట్‌గా దేవర అనే నామకరణం చేసుకున్న ఈ సినిమాపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు సినిమా అభిమానులకు కూడా భారీ అంచనాలున్నాయి. సినిమా లాంచింగ్‌ రోజే స్టోరీ లైన్‌ చెప్పేసిన కొరటాల.. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. టెక్నీషియన్స్‌ మొదలు యాక్టర్స్‌ వరకూ ప్రతీ ఒక్కరినీ పర్టికులర్‌గా సెలెక్ట్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది సీనియర్‌ యాక్టర్స్‌ ఉండగా ఇప్పడు కేజీఎఫ్‌ సినిమాలో నటించిన మరో యాక్టర్‌ను దింపబోతున్నాడు. కేజీఎఫ్‌ సినిమాలో విలన్స్‌ బ్యాచ్‌కి హెల్పర్‌ రోల్‌ చేసిన తారక్‌ పొన్నప్పను దేవర సినిమాలో ఓ కీ రోల్‌ కోసం తీసుకుంటున్నాడట కొరటాల. సినిమాలో తారక్‌ పొన్నప్ప రోల్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుందట. కథను పూర్తిగా మలుపు తిప్పే పాత్రలో తారక్‌ పొన్నప్ప కనిపించబోతున్నాడట. కేజీఎఫ్‌లో చేసింది చిన్న క్యారెక్టరే అయినా.. తారక్‌ పొన్నప్ప యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాడు తారక్‌ పొన్నప్ప. ఇప్పటికే ఈ సినిమాలో తారక్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ను తీసుకున్నారు.

హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. చాలా మంది వేరే ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్‌ కూడా ఉన్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీల యాక్టర్స్‌ను కలిపి సినిమాను పాన్‌ ఇండియా సినిమా చేశాడు కొరటాల. అటు టెక్నీషియన్స్‌ను కూడా విదేశాల నుంచి రప్పించి మరీ దేవర సినిమాను హాలీవుడ్‌ మూవీ లెవెల్‌లో తెరకెక్కిస్తున్నాడు. అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రతీసారి జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఓ ఫ్లాప్‌ తప్పదు. ఇప్పటికే ఈ మిత్‌ చాలా సార్లు రిపీట్‌ అయ్యింది.

ఇప్పుడు దేవర సినిమా ట్రిపులార్‌ సినిమా తరువాత చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఫ్యాన్స్‌లో ఒకింత భయం కూడా ఉంది. అయితే కొరటాల వర్కింగ్‌ స్టైల్‌, కాస్టింగ్‌ సెలక్షన్‌ చూస్తే ఎన్టీఆర్‌ లైఫ్‌లో చాలా కాలంగా కంటిన్యూ అవుతున్న ఈ మిత్‌ను బ్రేక్‌ చేసేలానే ఉన్నాడు. 2024 ఏప్రిల్‌ 5న ఆడియన్స్‌ ముందుకు రానున్న దేవర సినిమా ఎన్టీఆర్‌కు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.