KRISH PAVAN MOVIE : డైరక్టర్ క్రిష్ అరెస్ట్ తప్పదా !.. పవన్ కల్యాణ్ సినిమా ఆగినట్టేనా ?
క్రిష్ డైరెక్ట్ (Krrish Director) చేస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూవీ హరి హర వీరమల్లు ఇక ఆగిపోయినట్టేనా ? డ్రగ్స్ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Jaggerlamudi Krish) అరెస్ట్ అయితే మూవీ పరిస్థితి ఏంటి ? నాలుగేళ్ళుగా ప్రాజెక్ట్ నడుస్తున్నా... ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయా (AP Politics) ల్లో బిజీగా ఉండటంతో... షూటింగ్ అనుకున్న రేంజ్ లో ముందుకెళ్ళట్లేదు.

Director Krrish must be arrested!.. Pawan Kalyan's movie stopped?
క్రిష్ డైరెక్ట్ (Krrish Director) చేస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూవీ హరి హర వీరమల్లు ఇక ఆగిపోయినట్టేనా ? డ్రగ్స్ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Jaggerlamudi Krish) అరెస్ట్ అయితే మూవీ పరిస్థితి ఏంటి ? నాలుగేళ్ళుగా ప్రాజెక్ట్ నడుస్తున్నా… ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయా (AP Politics) ల్లో బిజీగా ఉండటంతో… షూటింగ్ అనుకున్న రేంజ్ లో ముందుకెళ్ళట్లేదు. తీరా ఇప్పుడు క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం… ఆయన అరెస్ట్ అయితే … హరి హర వీరమల్లు ఇంకా లేట్ అయ్యే చాన్సుంది అంటున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ఓ పీరియడ్ డ్రామా కథ (Period Drama Movie)… ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఎ ఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత. మూవీ మొదలుపెట్టి నాలుగేళ్ళయింది. మధ్యలో కొన్ని రోజులు వీలును బట్టి సినిమా షూటింగ్ కు టైమ్ కేటాయిస్తూ వచ్చాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని బిజీ అయ్యాడు. ఎన్నికలు అయిపోయి… రిజల్ట్స్ వచ్చి… కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఆయన బిజీగానే ఉంటాడు. హరి హర వీరమల్లు షూటింగ్ మొదలుపెట్టాక… నిర్మాత ఎ ఎం రత్నం కొండపొలం అనే మరో సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అది 2021లోనే విడుదలైంది. డైరెక్టర్ క్రిష్ మాత్రం ఇంకా వేరే ఏ సినిమా కూడా మొదలుపెట్టలేదు.
ఇప్పుడు రాడిసన్ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు క్రిష్. నేనేదో ఓ అరగంట హోటల్ కి వెళ్ళొచ్చాను. నాకు పార్టీ సంగతే తెలియదని మొదట బుకాయించాడు. కానీ క్రిష్ కి ఏడాదిగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పెడ్లర్ అబ్బాస్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో అసలు సంగతి బయటపడింది. ముంబైలో సినిమా పనిలో బిజీగా ఉన్నానని పోలీసులకు చెప్పిన క్రిష్ ఇంతవరకూ పత్తా లేడు. వీలైనన్ని ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే… కేసులో దొరికే ఛాన్స్ లేదని క్రిష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ నెల రోజులైనా ఆనవాళ్ళు దొరుకుతాయని నార్కో నిపుణులు చెబుతున్నారు. క్రిష్ తనంతట తాను విచారణకు రాకపోతే… పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఒక వేళ క్రిష్ అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు ? డ్రగ్స్ బాధితుడు కాబట్టి… పెద్ద కఠినమైన శిక్షలు ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ… ఏపీ ఎన్నికలు ముగిసేలోపు క్రిష్ జైలు నుంచి బయటకు రాకపోతే పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లుకు మళ్ళీ బ్రేక్ పడినట్టే అంటున్నారు. షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి నాలుగేళ్ళయింది… మరో ఏడాది అయినా పట్టొచ్చన్న టాక్ సినీ వర్గాల్లో నడుస్తోంది.