Hero Suman: తప్పుగా మాట్లాడాను.. క్షమించు సుమన్: నర్రా శివనాగు
నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్‌లో సుమన్ గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు శివనాగు. తన ఆడియో ఫంక్షన్‌కు సుమన్‌ను పిలవాలనుకున్నానని.. కానీ సుమన్ రెండు లక్షలు డిమాండ్ చేయడంతో పిలవలేదని చెప్పాడు. శివనాగు మాట్లాడిన ఈ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Hero Suman: సీనియర్ హీరో సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు శివనాగు సారీ చెప్పాడు. తాను ఏదో ధ్యాసలో ఉండి అలా మాట్లాడానని, వేరే వ్యక్తులు ఫోన్ చేసి చెప్తే తప్ప తాను చేసిన వ్యాఖ్యలను తాను గుర్తించలేకపోయానని చెప్పాడు. నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్‌లో సుమన్ గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు శివనాగు.
తన ఆడియో ఫంక్షన్‌కు సుమన్‌ను పిలవాలనుకున్నానని.. కానీ సుమన్ రెండు లక్షలు డిమాండ్ చేయడంతో పిలవలేదని చెప్పాడు. శివనాగు మాట్లాడిన ఈ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను తప్పుగా విన్నానో.. లేక సుమన్ మేకప్‌మ్యాన్ తప్పుగా చెప్పాడో తెలియదు కానీ తాను మాత్రం ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయినట్టు చెప్పాడు. సుమన్ కెమెరామ్యాన్ ఏదో చెప్తే తాను డబ్బులు అడుతున్నట్టు అర్థం చేసుకున్నానంటూ చెప్పాడు.
సుమన్ తన కుటుంబ సభ్యులతో సమానమని.. ఆయనతో కలిసి మూడు సినిమాలు చేశానన్నాడు. అలాంటి వ్యక్తి గురించి తాను ఎందుకు తప్పుగా మాట్లాడుతానంటూ చెప్పాడు. ఏదో ధ్యాసలో మాట్లాడిన మాటలే తప్ప తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు. ఈ విషయంలో సుమన్ బాధపడితే తనను మనస్పూర్తిగా క్షమించాలంటూ కోరాడు.