Sandeep: ఆ దర్శకుడిలోని జంతువు బయట పడింది.. తిడుతున్నారు..
సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ తీసినప్పుడు, ఆ బూతేంటి అన్నారు. హీరోయిన్ ని అలా హెరాస్ చేయటమేంటన్నారు. ఆ వయోలెన్స్ ఘోరంగా ఉందనేశారు. ఇంకొందరైతే అర్జున్ రెడ్డి మూవీ పేరు సందీప్ రెడ్డి అని పేరుపెట్టాలని, ఇది తన బయోపిక్కే అనేశారు.

Sandeep Animal Movie Glimps Release
నిజంగా సందీప్ రెడ్డిని అర్జున్ రెడ్డికి ఆత్మకాబట్టి, తనలోనే అలాంటి జంతులక్షనాలున్నాయని, వాటితోనే అర్జున్ రెడ్డి హీరోయిజాన్ని డెవలప్ చేశారనేశారు. ఇలాంటి కామెంట్లు ఎలా ఉన్నా, యానిమల్ మూవీ వచ్చాక సందీప్ రెడ్డిలో అసలైన జంతువు బయటికొచ్చాడంటున్నారు. దానికి కారణం కూడా ఉంది.
అప్పట్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు, బాలీవుడ్ మీడియాలో కొందరు సందీప్ రెడ్డి వయోలెన్స్ ని గ్లోరిఫై చేశాడన్నారు. ఆ కామెంట్స్ కి మండటంతో, అసలు వయోలెన్స్ ఏంటో చూపిస్తా అన్నాడు సందీప్ రెడ్డి. దాని ఫలితమే యానిమల్ లో ఆ అరాచకాలంటున్నారు. యానిమల్ గ్లింప్స్ వచ్చాక ఇది జస్ట్ సాంపిల్, అసలు ట్రైలర్ ముందుంటున్నాడు సందీప్ రెడ్డి. ఏదేమైనా ఆదిపురుష్ సినిమా రిలీజ్ రోజు దీనికి అటాచ్ చేసి వదలనున్న యానిమల్ టీజర్ తో ఇంకెన్ని సందీప్ అరాచకాలు బయట పడతాయో చూడాలి.