Director: రామ్ చరన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శంకర్

రామ్ చరణ్ కొంపముంచేలా ఉన్నాడు శంకర్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉందే.. ఇవి చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గేమ్ ఛేంజర్ టైటిల్ టీజర్ మీద పెరిగిన డౌట్లు, కామెంట్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2023 | 09:00 PMLast Updated on: Mar 28, 2023 | 9:00 PM

Director Shankar

త్రిబుల్ ఆర్ తర్వాత శంకర్ మేకింగ్ లో సినిమా అంటే రామ్ చరణ్ గట్టోడే, మంచి నిర్ణయమే తీసుకున్నాడన్నారు. కాని శంకర్ ఒక్క సారిగా టైటిల్ ని రివీల్ చేయగానే, ఆ పేరేంది; అసలా టైటిల్ టీజర్ ఏంది? ఇవి రియాక్షన్లు.. ఏదో బర్త్ డేరోజు మెగా పూనకాలుంటాయి. కాబట్టి, ఫ్యాన్స్ ఈ టైటిల్ టీజర్ ని ఎంజాయ్ చేశారు. కాని తర్వాత్తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ లేని డౌట్లు, కామెంట్లు పెరిగాయి.

ఇక భారతీయుడు 2 ఒక వైపు, గేమ్ ఛేంజర్ మరో వైపు తీస్తున్న శంకర్ మేకింగ్ మీద కొత్త అనుమానాలు పెరిగాయి. ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేస్తూ శంకర్ ఇప్పుడుచరణ్ కొంపముంచేలా ఉన్నాడా? ఆ టైటిల్ టీజర్ చూసి, ఇది రోబో లాంటి మూవీ తీసిన దర్శకుడి పనితనమేనా అంటున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ ని ఆచార్య రూపంలో కొరటాల ముంచేస్తే, ఇప్పుడు శంకర్ అదే పనిచేస్తాడా ఏంటి? ఇలాంటి డౌట్లతో మెగా ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ నగర్ సర్కిల్లో కూడా డిస్కర్షన్స్ మొదలయ్యాయి.