SS Rajamouli: రాజమౌళిని చూసి.. వాతలు పెట్టుకుంటున్న శంకర్, బోయపాటి!
అఖండ హిట్ తర్వాత బోయపాటి శీను ఇప్పుడు రామ్‌తో కొత్త మూవీ తీస్తున్నాడు. ఏకంగా 1500 మంది ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు. ఇంచు మించు ఇలానే రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం శంకర్ కూడా 2000 మంది ఫైటర్స్‌తో క్లైమాక్స్ సీన్ ప్లాన్ చేశాడట.
SS Rajamouli: పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే.. వాచిపోతుంది. ఇప్పుడు అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి తీరు చూస్తుంటే. ఇద్దరూ ఇద్దరే! అయితే, రాజమౌళి కంటే గొప్ప సినిమా తీయబోయి తిప్పలు తెచ్చుకుంటున్నారు. అఖండ హిట్ తర్వాత బోయపాటి శీను ఇప్పుడు రామ్‌తో కొత్త మూవీ తీస్తున్నాడు.
ఏకంగా 1500 మంది ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు. ఇంచు మించు ఇలానే రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం శంకర్ కూడా 2000 మంది ఫైటర్స్‌తో క్లైమాక్స్ సీన్ ప్లాన్ చేశాడట. ఇదంతా త్రిబుల్ ఆర్ ఎఫెక్టే.. అందులో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్‌లో 1000 మంది ఫైటర్స్‌తో తీసిన సీన్ ఎంతగా సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాన్ని మించిన సీన్ తీసేందుకు 2000 మంది ఫైటర్స్‌తో శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ ప్లాన్ చేస్తే, బోయపాటి 1500 మందితో రామ్‌ని మరో రామ్ చరణ్‌గా మార్చేప్రయత్నం చేస్తున్నాడు. అయితే త్రిబుల్ ఆర్ రేంజ్‌లో రియలిస్టిక్‌గా సీన్ వస్తే తప్ప అలాంటి సీన్లు పేలవు. అక్కడే తేడా కొట్టేలా ఉంది.