RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అడ్డు పడుతున్న శంకర్

బుచ్బి బాబు మేకింగ్‌లో తను చేయబోయే సినిమా శ్రీకాకుళం వాసి కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌గా తెరకెక్కబోతోందట. పూర్తిగా బయోపిక్ కాదు కాని.. కోడి రామ్మూర్తి లైఫ్‌ని బేస్ చేసుకుని ఓ ఫిక్షన్, పీరియాడికల్ డ్రామా ప్లాన్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 06:17 PMLast Updated on: Feb 13, 2024 | 6:17 PM

Director Shankar Delaying Ram Charan Next Movie With Buchibabu Sana

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ హెర్కులస్‌గా మారే పనిలో ఉన్నాడు. బుచ్బి బాబు మేకింగ్‌లో తను చేయబోయే సినిమా శ్రీకాకుళం వాసి కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌గా తెరకెక్కబోతోందట. పూర్తిగా బయోపిక్ కాదు కాని.. కోడి రామ్మూర్తి లైఫ్‌ని బేస్ చేసుకుని ఓ ఫిక్షన్, పీరియాడికల్ డ్రామా ప్లాన్ చేశారు.

Chiranjeevi: మాస్ రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో పోరాట సన్నివేశాలు..!

ఇందులో కోడి రామ్మూర్తి నాయుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించాల్సి ఉంది. తన గెటప్‌ని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా లాంగ్ హేయిర్‌తో ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. ఇంకా హీరో లుక్ మరింత మారాల్సి ఉందట. ఏకంగా 3 నెలలు వర్కవుట్లు, స్పెషల్ డైట్‌తో మరింత కండలు పెంచబోతున్నాడు చరణ్. కాని విచిత్రం ఏంటంటే ఇప్పటికిప్పుడు చరణ్ ఏ నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే తనిప్పుడు తన లుక్ మార్చాలంటే, ముందుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేయాలి. లాస్ట్ షెడ్యూల్ పూర్తైతే తప్ప చరణ్‌కి ఫ్రీడమ్ రాదు. అప్పుడుగాని తన లుక్ మార్చకునే వీలు రాదు.

అందుకే ఎప్పుడు శంకర్ సినిమా పూర్తవుతుందా అని చరణ్ కంటే ఎక్కువగా బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నాడు. ఇదెలా ఉందంటే, శంకర్ తన గేమ్ ఛేంజర్ మూవీ పూర్తి చేయడు. చరణ్‌ని ఫ్రీ బర్డ్‌గా మార్చడు. ఫలితంగా చరణ్ కొత్త సినిమా చేద్దామన్నా చేసే పరిస్థితి లేదు. ఇది మెగా అడుగుకి అడ్డుపడుతున్న శంకర్ రెక్లెస్‌నెస్. ఇవి సోషల్ మీడియాలో పెరిగిన కామెంట్స్ .