RAM CHARAN: రామ్ చరణ్ సినిమాను శంకర్ రిస్కులో పెట్టాడా..?

గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. మరో వైపు లివింగ్ లెజెండ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ కాబట్టే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.75 కోట్లకి సేల్ అయ్యాయి. నార్త్‌లో మరికొన్ని ఏరియాల రైట్స్ కలిపితే ఈజీగా వందకోట్లు రావొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 08:11 PMLast Updated on: Apr 22, 2024 | 8:11 PM

Director Shankar Not Focusing On Ram Charans Game Changer Movie

RAM CHARAN: త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన మూవీ ఆచార్య. కాని పాన్ ఇండియా లెవల్లో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. అయినా ఇది చిరు సినిమాగానే ఫోకస్ అయ్యింది. కాబట్టి శంకర్ మేకింగ్‌లో వచ్చే గేమ్ ఛేంజరే ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమాగా ఫోకస్ అవుతోంది. ఒక వైపు త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. మరో వైపు లివింగ్ లెజెండ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ కాబట్టే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.75 కోట్లకి సేల్ అయ్యాయి.

Akhanda 2: పూనకాలు లోడింగ్.. అఖండ 2లో బాలయ్య ఊచకోత

నార్త్‌లో మరికొన్ని ఏరియాల రైట్స్ కలిపితే ఈజీగా వందకోట్లు రావొచ్చు. రిలీజ్‌కి ముందే ఓ తెలుగు సినిమాకు నార్త్ ఇండియాలో వందకోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ అంటే అది రికార్డే. అంతగా అనిల్ తడానీ అండ్ కో ఈ మూవీ రైట్స్‌ని వందకోట్లు కుమ్మరించి కొనేయటానికి ఈ సినిమా మీదున్న అంచనాలే కారణం. విచిత్రం ఏంటంటే గేమ్ ఛేంజర్ మీద ఇంతగా అంచనాల భారం ఉన్నా, ఏమాత్రం అంచనాల భారం లేని భారతీయుడు 2 మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్. ఈ మూవీని జూన్‌లో విడుదల చేయాలనే చూస్తున్నాడు తప్ప, గేమ్ ఛేంజర్‌కి సాలిడ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటంలో స్పీడ్ పెంచట్లేదు. ఏదో దీపావళికి రిలీజ్ అంటున్నారే తప్ప, తన ఫోకస్ అంతా భారతీయుడు 2 మీదే ఉంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ కావొచ్చు.

కాని సీక్వెల్ రూపంలో వస్తే ఇప్పుడు అదే రేంజ్ సెన్సేషన్ క్రియట్ చేస్తుందనలేం. కోలీవుడ్‌లోతప్ప ఈ సినిమా మీద ఎక్కడా పెద్దగా అంచనాలు లేవు. అలాంటి ఈ మూవీకోసం ఆకాశాన్నంటే అంచానాలున్న గేమ్ ఛేంజర్‌ని రిస్క్ లోపెడుతున్నాడు శంకర్. గేమ్ ఛేంజర్ ప్రమోషన్‌లో ఎమోషన్ లేదు. రిలీజ్ డేట్ ఏది కన్ఫామ్ కాలేదు. అందుకే శంకర్ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో భారీగా పెరిగాయి.