Indian 2: భారీ స్కెచ్.. ఒక్క పాటకు 30 కోట్లు ఏంది సామి..!
ఇప్పుడు శంకర్.. ఇండియన్ 2లో ఒక్క పాట కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమాలో కీలకంగా కాబోతున్న ఓ పాట కోసం ప్రత్యేకించి ఏవీఎమ్ స్టూడియోలో రూ.10 కోట్లతో ఓ సెట్‌ను కూడా వేశారట.
Indian 2: డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది గ్రాండ్‌నెస్. ఈయన సినిమాల్లో ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. బడ్జెట్ ఎంతైనా సరే.. శంకర్ తాను అనుకున్న ఔట్పుట్ వచ్చేంతవరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ విషయంలో శంకర్ అస్సలు తగ్గడు. అందుకే ఆయన సినిమాల్లోని పాటలు స్క్రీన్‌పై అంత అద్భుతంగా కనిపిస్తాయి. కేవలం ఈయన సినిమాల్లోని పాటలు చూడటానికే రిపీటెడ్‌గా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులున్నారు.
Rc16 : చెర్రీ సరసన ఆ హీరోయిన్ ఫిక్స్..?
నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పైన కనిపిస్తుంది. శంకర్ ఒక్క పాటపై పెట్టే బడ్జెట్లో ఓ మీడియం రేంజ్ హీరో సినిమా తీసేయొచ్చు అని ఇండస్ట్రీలో అంటుంటారు. రీసెంట్గా ‘ఇండియన్ 2’లో ఓ పాట కోసం పెట్టిన బడ్జెట్ వింటుంటే నిజమే అనిపిస్తుంది. మాములుగా ఒక పాట కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారంటేనే బాబోయ్ అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు శంకర్.. ఇండియన్ 2లో ఒక్క పాట కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమాలో కీలకంగా కాబోతున్న ఓ పాట కోసం ప్రత్యేకించి ఏవీఎమ్ స్టూడియోలో రూ.10 కోట్లతో ఓ సెట్‌ను కూడా వేశారట. ఇక పాట మేకింగ్ కోసం మరో 20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెన్నై టాక్. పాట కోసమే 30 కోట్లా అని అందరూ నోరెళ్ల బెడుతున్నారు. ఏది ఏమైనా రూ.30 కోట్లు కేవలం ఒక్క పాట మేకింగ్ కోసమే ఖర్చు చేస్తున్నారంటే మాములు విషయం కాదు. ‘రోబో’ సీక్వెల్ తర్వాత శంకర్ ఏడాది గ్యాప్‌లోనే ఈ సినిమాను పట్టాలెక్కించాడు. కొంత వరకు షూటింగ్ కూడా జరిగింది. కానీ పలు కారణాల వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్లీ ఎన్నో అంతరాయాల తర్వాత రెండేళ్ళ కిందట సెప్టెంబర్‌లో ఇండియన్-2 సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది.
అప్పటి నుంచి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. శంకర్ ఓ వైపు గేమ్ చేంజర్ తెరకెక్కిస్తూనే.. మరోవైపు ఇండియన్-2 సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫుటేజీ మొత్తం దాదాపు 6గంటలు వచ్చిందని. దీంతో ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. ఒక్క పార్టుగానే సినిమా రిలీజవుతుందని తెలుస్తుంది. సమ్మర్లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.