Director Shankar: శంకర్ సొంత కథని నమ్ముకోలేదా.. గేమ్ ఛేంజర్ కథలో అంత స్పెషాలిటీ ఏంటి..?
హిందీ హిట్ 3 ఇడియన్స్ రీమేక్ నన్బన్ మినహాయిస్తే.. శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా కథలన్నీ ఆయన సొంత కథలే. గేమ్ చేంజర్ కథను మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించాడు. కథలు ఏమైనా వున్నాయా అని శంకర్ అడిగితే.. గేమ్ ఛేంజర్ కథను కార్తీక్ చెప్పాడు.
Director Shankar: సొంత కథలతో సినిమాలు తీసే శంకర్.. గేమ్ ఛేంజర్ విషయంలో ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడు..? జెంటిల్‌మెన్ నుంచి 2.0 వరకు అన్నీ సొంత కథలతో వచ్చినవే. చివరకు సెట్స్‌పై వున్న భారతీయుడు2ను కూడా సొంత కథతో తీస్తుంటే.. గేమ్ ఛేంజర్‌ను మాత్రం వేరేవాళ్ల కథతో ఎందుకు తీస్తున్నాడు..? శంకర్ సినిమా అంటే కథలో ఏదో ఒక సమస్యను లేవనెత్తి పరిష్కారం ఇస్తాడు. జెంటిల్‌మెన్ నుంచి ఇదే జరగుతోంది.
హిందీ హిట్ 3 ఇడియన్స్ రీమేక్ నన్బన్ మినహాయిస్తే.. శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా కథలన్నీ ఆయన సొంత కథలే. గేమ్ చేంజర్ కథను మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించాడు. కథలు ఏమైనా వున్నాయా అని శంకర్ అడిగితే.. గేమ్ ఛేంజర్ కథను కార్తీక్ చెప్పాడు. కథ బాగా నచ్చడంతో.. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మొదలైంది. కార్తీక్ తీసిన ‘జిగర్తండ 2’ ప్రమోషన్‌లో గేమ్ ఛేంజర్ ప్రస్తావన రాగా.. శంకర్ మార్క్‌తో ఆయన మాత్రమే తీయగల కథ ఇదన్నాడు. ఆ మధ్య పూరీ జగన్నాథ్ కూడా ఇలాగే మరో కథతో టెంపర్ తీశాడు.
సినిమా కథను అందరికంటే తక్కువ టైంలో రెడీ చేసే పూరీ ఆమధ్య వరుస ఫ్లాపుల్లో పడిపోయాడు. దీంతో.. వక్కంతం వంశీ రాసుకున్న కథను టెంపర్‌గా తీసి హిట్ కొట్టాడు. సొంత కథలతో ఆడియన్స్ బోర్ ఫీలైతే.. ఇలా ఛేంజ్ ఓవర్ కెరీర్‌కే మంచిదే.