Director Shankar’s : ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. భవిష్యత్తులో అన్ని సీక్వెల్ లే…
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్తంలో తెరకెక్కుతున్న మూవీ ‘భారతీయుడు 2’. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

Director Shankar's interesting comments on future projects.. There are no sequels in the future...
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్తంలో తెరకెక్కుతున్న మూవీ ‘భారతీయుడు 2’. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ తన ఫ్యూచర్‌లో తను ఎలాంటి మూవీస్ తీయాలనుకుంటున్నాడో వెల్లడించారు.‘‘‘జేమ్స్ బాండ్’ తరహా చిత్రాలు తీయాలి. అలాగే హిస్టారికల్, సైన్స్‌ఫిక్షన్ సినిమాలు చేస్తాను. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కచ్చితంగా ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాను’’ అని తెలిపారు.
ఈ సంవత్సరం అంటే ఈ నెల 12న భారతీయుడు 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.. తాజాగా డైరెక్టర్ శంకర్ మరో గుడ్ న్యూస్ చెప్పాడు కమల్ హాసన్ ఫ్యాన్ కు.. ఈ కమల్ హాసన్ తో మరో సినిమా రాబోతుందని.. అది కూడా భారతీయుడు 3 తెల్చి చెప్పాశాడు. దీంతో కోలీవుడ్ తమిళ్ కమల్ అభిమానులకు ఇదో శుభవార్త అని చెప్పవచ్చు.
మరో 6 నెలల్లో భారతీయుడు-3 వచ్చేస్తుంది…
భారతీయుడు-3 సినిమాని మరో 6 నెలల్లో విడుదల చేస్తామని దర్శకుడు శంకర్ తెలిపారు. పార్ట్-3లోనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందన్నారు. ‘భారతీయుడు మూవీకి సీక్వెల్ అవసరమా? అనే సందేహంలోనే ఏళ్లు గడిచిపోయాయి. కానీ అవినీతి ఇంకా అలానే ఉందని పత్రికలు, టీవీలు గుర్తుచేశాయి. అందుకే భారతీయుడు2 తీయాలనుకున్నా.. అని చెప్పుకోచ్చారు.
మరో మూడు హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ప్లాన్… ( ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు )
డైరెక్టర్ శంకర్ భారతీయుడు సినిమాతోనే సీక్వెల్ ఆగిపోతాయని అనుకుంటే.. 1999 లో అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు, 2000 లో సూపర్ స్టార్ రజినికాత్ నటించిన శివాజీ, 2005 లో విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు చిత్రాలకు కూడా సమయం వచ్చినప్పుడు పార్ట్2 తెరకెక్కిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్ 2… ?
దీంతో తాజాగా రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా పార్ట్ 2 పై వివరణ ఇచ్చారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు-2’ విడుదలయ్యాక మిగతాది పూర్తి చేస్తామని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ రెండు సినిమాలకు అసలు పోలికే లేదన్నారు. కథ దృష్ట్యా గేమ్ ఛేంజర్‌కు రెండో భాగం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ ఇంకా ప్రకటించలేదు.