SS Rajamouli (jakkanna): వాట్ ఈజ్ దిస్ జ‌క్క‌న్నా..?

ఆర్ఆర్ఆర్ (RRR).. పాన్ ఇండియా (Pan India) చిత్రంగా విడుద‌లైన ఈ మ‌ల్టీస్టార‌ర్ (Multistarrer) మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Mega Power Star Ram Charan), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Young NTR) హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఈ మూవీలోని సాంగ్‌కు ఆస్కార్ అవార్డు కూడా సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2024 | 11:28 AMLast Updated on: Jan 26, 2024 | 11:28 AM

Director Ss Rajamouli Commented That Alluri Sitarama Rajus Character In Rrr Movie Is A Side Role

ఆర్ఆర్ఆర్ (RRR).. పాన్ ఇండియా (Pan India) చిత్రంగా విడుద‌లైన ఈ మ‌ల్టీస్టార‌ర్ (Multistarrer) మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Mega Power Star Ram Charan), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Young NTR) హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఈ మూవీలోని సాంగ్‌కు ఆస్కార్ అవార్డు కూడా సాధించింది. అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీకి య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌ని జోడించి రాజ‌మౌళి త‌న‌దైన స్టైల్లో తీసిన ఈ చిత్రంలో.. చెర్రీ, జూనియ‌ర్ ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించారు. అయితే.. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదం కూడా జ‌రిగింది. రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని.. ఎన్టీఆర్‌ ఏమాత్రం ప్రాధాన్యం లేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే.. ఇద్ద‌రి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇచ్చామంటూ రాజ‌మౌళి (SS Rajamouli) ముందు నుంచీ చెప్తూనే వ‌చ్చారు. ఇప్పుడు రీసెంట్‌గా చెర్రీ, ఎన్టీఆర్ పాత్ర‌ల‌పై రాజ‌మౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

జ‌క్క‌న్న ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త్రిపుల్ ఆర్ మూవీ గురించి ఆయ‌న‌కు మ‌రోసారి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఎన్టీఆర్‌ పాత్రని సైడ్‌ రోల్‌గా చూపించార‌న్న కామెంట్ల‌పై ఆయ‌న స్పందించారు.. ఆ వ్యాఖ్య‌లు కాస్తా ఎన్టీఆర్‌కు పాజిటివ్‌గా ఉండ‌డంతో.. అవి కాస్తా వైర‌ల్‌గా మారాయి.
ఈ సినిమాలో కనుక కొమరం భీముడు అనే పాటతోనే సినిమాని కనుక పూర్తి చేసి ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం సైడ్ క్యారెక్టర్ అయ్యేద‌న్నారు రాజ‌మౌళి.. అప్పుడు చర‌ణ్‌ది ప్రధాన పాత్ర అయ్యేది కాదంటూ జ‌క్క‌న్న చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రాజ‌మౌళి వ్యాఖ్య‌లు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపితే.. చెర్రీ ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా డిజ‌ప్పాయింట్ అవుతున్నారు.. జ‌క్క‌న్న ఇలా మాట్లాడారేంటి అంటూ కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్లో చర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌ల‌పై రాజ‌మౌళి తండ్రి, క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఇటీవ‌ల స్పందించారు. ఎన్టీఆర్ పాత్ర చాలా క‌ష్టంతో కూడుకున్న పాత్ర అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఏకంగా జ‌క్క‌న్నే చ‌ర‌ణ్‌ది సైడ్ రోల్ అంటూ వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు దుమారం రేపుతోంది. రామ్ చరణ్ ది సైడ్ రోల్ అయితే ఎన్టీఆర్ ది హీరో పాత్ర కథ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్ మరింత వైరల్ చేస్తున్నారు. దీంతో.. చ‌రణ్ ఫ్యాన్స్ వీళ్ల‌కి కౌంట‌ర్లిస్తున్నారు. మొత్తానికి రాజ‌మౌళి ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేసారో కానీ.. స‌ద్దుమ‌ణిగిన వివాదం మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్ల‌యింద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.