Anasuya – Sukumar : సుకుమార్‌కి అనసూయ కలిసొచ్చిందా.. అనసూయకి సుకుమార్‌ కలిసి వచ్చాడా ?

నమ్మకాలకు, సెంటిమెట్లకు కేరాఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ! కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి.. ఎన్ని దెబ్బలకు ముక్కలు అవ్వాలి అన్నట్లుగా నమ్మకాలు పెట్టుకుంటారు కొందరు నిర్మాతలు, దర్శకులు ! ఇక యాక్టర్ల విషయంలో అయితే మరీనూ ! తమకు సెంటిమెంట్‌ అనుకున్న నటులను ఎలాగోలా సినిమాలో పెట్టేస్తుంటారు డైరెక్టర్లు ! కథలో స్కోప్‌ లేకపోయినా సరే.. స్పేస్ క్రియేట్ చేసి మరీ వాళ్లను దింపుతుంటారు. వాళ్లు వీళ్లు అని కాదు.. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లకు ఇలాంటి సెంటిమెంట్‌ ఉంది. ఇలాంటివి నమ్మను అనే ఆర్జీవీ కూడా.. తన సినిమాలో తనికెళ్ల భరణి తప్పక ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 01:45 PMLast Updated on: Apr 13, 2023 | 1:57 PM

Director Sukumar Film Chances To Anasuya

బ్రహ్మాజీని కృష్ణవంశీ, శేఖర్‌ను రాజమౌళి, రావు రమేష్‌ను శ్రీకాంత్ అడ్డాల.. ఇలా చాలామంది డైరెక్టర్లు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. పాటలో పండ్లు రాఘవేంద్రరావుకు సెంటిమెంట్ అయితే.. ఇళయరాజా మ్యూజిక్‌ వంశీకి.. అలీ యాక్టింగ్‌ పవన్‌కల్యాణ్‌కు సెంటిమెంట్‌. సినిమాలో వాళ్లు అలా కనిపించినా, వినిపించినా చాలు.. అంతా మంచే జరుగుతుందన్నది వాళ్ల నమ్మకం. మిస్టర్ జీనియస్ సుకుమార్‌ కూడా.. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంటే ఫాలో అవుతున్నాడు మరి! జబర్దస్త్ యాంకర్‌ అనసూయ.. తన సినిమాలో తప్పక ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

రంగస్థలం మూవీలో అనసూయకు మంచి కేరక్టర్ ఇచ్చాడు. పెద్ద పాత్రే కాదు.. అనసూయ రోల్‌ ఒకరకంగా కథకు ఆత్మ ! సుకుమార్‌ మ్యాజిక్‌కు ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. దీంతో కలెక్షన్ల రికార్డులు క్రియేట్‌ చేసిందీ మూవీ. ఆ మూవీ తర్వాత పుష్పలోనూ అనసూయ కోసం మంచి రోల్ క్రియేట్ చేశాడు సుక్కు. మంగళం శీను భార్య ద్రాక్షాయణిగా.. అనసూయ కూడా అదరగొట్టింది. కట్‌ చేస్తే పుష్ప నేషనల్‌వైడ్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2లోనూ అనసూయ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు సుకుమార్‌. ఫస్ట్ పార్ట్‌కు మించి.. పుష్ప 2లో పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్‌. అనసూయను సినిమాలకు మాత్రమే పరిచయం చేశాడా అంటే.. సెంటిమెంట్ అంతకుమించి అని ప్రూవ్ చేశాడు.

ఆ మధ్య ఓ రియల్‌ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో ఏకంగా చిరంజీవి పక్కన అనసూయను పెట్టేశాడు సుక్కు. డైరెక్టర్ నిర్ణయంపై ఇండస్ట్రీలో రకరకాల చర్చ జరిగింది. ఆ యాడ్‌లో ఖుష్బూ కూడా కనిపిస్తుంది. చిరు, కుష్బూలాంటి వారి పక్కన అనసూయ ఏంటి.. వారి స్టేటస్‌ ఏంటి అనసూయ స్థాయి ఏంటి అని రకరకాల కామెంట్లు చేశారు. ఐతే సుకుమార్ కావాలని పట్టుబట్టి సెలక్ట్ చేయడంతో.. ఎవరూ ఆ మాట బయటకు అనలేకపోయారు. ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ కోసం.. అనసూయకు సుకుమార్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇప్పించాడట.

ఇలా అనసూయ విషయంలో సుకుమార్‌ తీరుతో.. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. సుక్కు సినిమా టైటిల్స్‌ క్రియేటివ్‌గా ఉండడం ఎంత కామనో.. అనసూయ కనిపించడం కూడా అంతే కామన్‌ కాబోలు ఇక అని ఎవరికి వారు గుసగుసలాడుకుంటున్నారు. సుకుమార్ శిష్యులు కూడా డైరెక్టర్లు అవుతున్నారు. బుచ్చిబాబు, శ్రీకాంత్.. తామెంటో ప్రూవ్‌ చేసుకున్నారు. దీంతో శిష్యుల సినిమాల్లోనూ అనసూయకు మంచి పాత్రలు తప్పనిసరి ఏమో అనిపిస్తోందిప్పుడు ! ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టాలన్నట్లు.. అనసూయ కూడా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. జబర్దస్త్‌కు రాంరాం చెప్పింది. నాలుగు రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో సుకుమార్‌కు అనసూయ కలిసివచ్చిందా.. అనసూయకు సుకుమార్ కలిసివచ్చాడా అని ముక్కున వేలేసుకొని మరీ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అంటారు మరి.. ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్ ఎవరో ఒకరు ఉండాలని !