MEGASTAR CHIRANJEEVI: పుష్ప తర్వాత.. మెగాస్టార్‌తోనేనా..?

చరణ్‌తో సినిమా కుదరకపోతే, చిరు కోరిక మేరకు తన అభిమాని అయిన సుకుమార్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడనే చర్చ మొదలైంది. మొత్తానికి సుకుమార్ నెక్ట్స్ మూవీ కూడా మెగా కాంపౌండ్ లోపలే అనేది కన్ఫామ్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 04:43 PMLast Updated on: Jan 29, 2024 | 4:44 PM

Director Sukumar Next With Ram Charan Or Chiranjeevi

MEGASTAR CHIRANJEEVI: పుష్ప 2 ఆగస్ట్ 15 కి రిలీజ్ అన్నారు. కాని రీషూట్లతో బడ్జెట్ పెరుగుతోంది. రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతోందనే ప్రచారం పెరిగింది. వాటి సంగటి అటుంచితే, బడ్జెట్ పెరిగినా, రిలీజ్ వాయిదా పడ్డా మొత్తానికైతే ఈ ఏడాదే పుష్ప 2 వస్తుంది. ఆగస్ట్ మిస్ అయితే అక్టోబర్‌లో లేదా పుష్ప 1 లానే డిసెంబర్‌లో ఈ మూవీ దుమ్ముదులుపబోతుంది. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి, కేజీయఫ్ 2, బాహుబలి 2 లానే ఇది ట్రెండ్ బెండ్ తీసేఛాన్స్ ఉంది.

HANUMAN: అరుంధతి మూవీని గుర్తుకు తెస్తున్న హనుమాన్ కలెక్షన్స్

ఈ మూవీ తర్వాత బన్నీ కోసం బోయపాటి, త్రివిక్రమ్, ఆట్లి అంటూ క్యూలో డైరెక్టర్లున్నారు. మరి సుకుమార్ పరిస్థితేంటి..? అక్కడే సీన్ వెరైటీగా మారింది. ప్రభాస్.. కనీసం రెండున్నరేళ్లవరకు బిజీ. చేతిలో 4 సినిమాలున్నాయి. బన్నీ రెండేళ్లు బిజీ. ఎన్టీఆర్ కూడా రెండేళ్లవరకు బిజీ. విజయ్ దేవరకొండతో మూవీ అనుకుని తర్వాత సుకుమార్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి తనతో సినిమా తీస్తాడనలేం. మహేశ్ బాబు ఆల్రెడీ రాజమౌళి ప్రాజెక్ట్‌తో లాక్ అయ్యాడు. కాబట్టి తను కూడా నో ఛాన్స్. ఎలా చూసినా చరణ్‌తో రంగంస్థలం తర్వాత కాంబో ప్లాన్ చేద్దామన్నా, ఆల్రెడీ సుకుమార్ శిష్యుడితో చరణ్ సినిమా మార్చ్‌లో మొదలు కాబోతోంది.

కాబట్టే చరణ్‌తో సినిమా కుదరకపోతే, చిరు కోరిక మేరకు తన అభిమాని అయిన సుకుమార్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడనే చర్చ మొదలైంది. మొత్తానికి సుకుమార్ నెక్ట్స్ మూవీ కూడా మెగా కాంపౌండ్ లోపలే అనేది కన్ఫామ్ అయ్యింది.