Director Sukumar: సుకుమార్ శిష్యులంతా పరమ”నాటు”గాళ్లే..

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన గుణ శేఖర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యాడు. తేజ ట్రెండ్ సెట్ చేశాడు. ఇక వర్మ ప్రియ శిష్యులు వివి వినాయక్, కృష్ణ వంశీ, పూరీ జగన్నాథ్ గురించి చెప్పక్కర్లేదు.. ఇలా లెక్కేస్తే డజన్ పైనే ట్రెండ్ సెట్ చేశారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 10:00 PMLast Updated on: Apr 01, 2023 | 10:00 PM

Director Sukumar Students In Tollywood

ఇప్పుడు అచ్చంగా సుకుమార్ శిష్యులు కూడా వర్మ శిష్యుల్లానే హిస్టరీ క్రియేట్ చేస్తున్నట్టున్నారు. రంగస్థలం టైంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఒదేల దసరా మూవీతో పాన్ ఇండియా బెండుతీస్తున్నాడు. మరో సుకుమార్ అనిపించుకునేంతగా, రంగస్థలాన్నే దసరా మించుతోందనేంతగా సీన్ మారిపోయింది. ఇక పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ నే దసరా మించేలా ఉంది.

అచ్చంగా ఇలానే ఉప్పెనతో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. తన మొదటి సినిమా ఉప్పెనతో మాస్ మతిపోగొడుతూనే రొమాంటిక్ కిక్ ఇచ్చాడు. 100 కోట్ల వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేశాడు. మొత్తానికి కుమారి 21 ఎఫ్ రిలీజ్ టైంలో సుకుమార్ అసిస్థెంట్లు అలా వచ్చి ఇలా వెళ్లే బాపతే అనే కామెంట్లువచ్చాయి. కాని ఆ కామెంట్లకు గేట్లేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు శ్రీకాంత్, బుచ్చి బాబు అండ్ కో.