Surya Kiran: కల్యాణి, సూర్యకిరణ్ విడాకులకు అసలు కారణం ఎవరు..?
సత్యం మూవీతో హిట్ కొట్టిన సూర్య కిరణ్.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. ఐతే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడపలేకపోయారు. ఇద్దరూ విడిపోయారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది.

Surya Kiran: ఆస్తులు లేక.. భార్య లేక.. ఆ ఆవేదన మధ్య నరకం చూసి.. చివరికి అనారోగ్యం బారిన పడి.. డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూశారు. సుమంత్ హీరోగా సత్యం మూవీతో హిట్ కొట్టిన సూర్య కిరణ్.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. ఐతే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడపలేకపోయారు. ఇద్దరూ విడిపోయారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. నిజానికి పెళ్లైన కొత్తల్లో ఇద్దరు కూడా.. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండేవారు. హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏం జరిగిందో.. ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్!
వాళ్ల డివోర్స్ మీద ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది ఇప్పటికీ! వారి విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే అని తెలుస్తోంది. దీనికితోడు పిల్లలు కూడా లేకపోవడంతో.. వీరి అనుబంధానికి బీటలుపారాయ్. ఇద్దరూ మానసికంగా దూరమైన తర్వాత విడాకులు తీసుకున్నారు. సత్యం తర్వాత.. సూర్యకిరణ్‌కు సరైన హిట్ పడలేదు. దీనికితోడు నిర్మాతగా కూడా అడుగులు వేయడంతో.. ఆర్థికంగా చాలా చితికిపోయారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కల్యాణి ఆర్థిక బాధ్యతలు తీసుకున్నా.. కుటుంబాన్ని నిలబెట్టేంత సంపాదించకలేకపోయింది. దీంతో ఇద్దరూ విడాకులే శరణ్యం అనుకున్నారు. సూర్యకిరణ్ నిర్మాతగా మారడమే.. ఆయనను ఆర్థికంగా భారీగా దెబ్బ తీసింది. ఈ ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేసింది. ఆర్థికంగా కోలుకోకుండా చేసింది. చెల్లెలు సుజిత సాయం చేసినా.. గట్టుకు చేరే పరిస్థితి లేకుండా పోయింది. కేరళలో తనకు ఉన్న విలువైన ఆస్తులను కూడా సూర్యకిరణ్ అమ్మేశాడు.
ఐనా సరే.. అప్పులు తీరకపోగా.. మరింత ఒత్తిడి పెరిగింది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతంలాంటి చిత్రాలలో నటించి.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కళ్యాణి మంచి పేరు తెచ్చుకున్నారు. సూర్య కిరణ్‌తో విడిపోయినప్పటి నుంచి కల్యాణి.. చెన్నైలోని తన నివాసంలో ఉంటున్నారు. దర్శకురాలిగా మారి ఓ చిన్న తరహా బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే.. ఒక చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయ్. సూర్యకిరణ్‌కు.. టీవీ నటి సుజిత సొంత చెల్లెలు. ఇక ఆయన లేడని తెలిసి ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన జీవితంలో సూర్యకిరణ్ తండ్రి పాత్ర పోషించారని.. అలాంటి వ్యక్తి ఇక లేరు అని ఊహించుకోవడమే బాధగా ఉందంటూ.. సుజిత ఎమోషనల్ అవుతున్నారు.