SURYA KIRAN: సూర్యకిరణ్ మరణం తర్వాత.. కల్యాణి చేసిన పనికి కన్నీళ్లు..
సూర్యకిరణ్ మరణానికి తనను బాధ్యురాలిని చేస్తూ.. రకరకాల వార్తలు రాసుకొచ్చినా.. ఎవరికి వారు కథనాలు వండి వార్చినా.. కల్యాణి ఇంకా మౌనంగానే ఉంది. సోషల్ మీడియా, మెయిన్ మీడియా.. ఎక్కడా చిన్నగా కూడా రియాక్ట్ కావడం లేదు. నిజానికి సూర్యకిరణ్ జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

SURYA KIRAN: సత్యం మూవీ దర్శకుడు సూర్యకిరణ్ అకాల మరణం.. సినిమా ప్రేమికులను విషాదంలో నింపింది. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం ప్రతీ ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. ఆయన మరణానికి మించి.. సూర్యకిరణ్ జీవితం తలుచుకుంటే ఎవరికీ కన్నీళ్లు ఆగడం లేదు. పీకల్లోతు అప్పులు.. భార్యతో విడాకులు.. చివరి రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. చావుకు ముందు ఎంత నరకం చూశారో అనే ఆలోచనే.. ప్రతీ ఒక్కరి మనసు మెలేస్తోంది. సూర్యకిరణ్ చనిపోయి దాదాపుగా నెల కావొస్తున్నా.. ఆయన భార్య కల్యాణి మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కనీసం బయట కనిపించలేదు.
Srinu Vaitla: వెంకీ 2పై క్రేజీ అప్‌డేట్ చెప్పిన శ్రీను వైట్ల.. వర్కవుట్ అవుతుందా..?
సూర్యకిరణ్ మరణానికి తనను బాధ్యురాలిని చేస్తూ.. రకరకాల వార్తలు రాసుకొచ్చినా.. ఎవరికి వారు కథనాలు వండి వార్చినా.. కల్యాణి ఇంకా మౌనంగానే ఉంది. సోషల్ మీడియా, మెయిన్ మీడియా.. ఎక్కడా చిన్నగా కూడా రియాక్ట్ కావడం లేదు. నిజానికి సూర్యకిరణ్ జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. తన చెల్లి సుజిత కూడా.. సూర్యకిరణ్, కల్యాణి గురించి పాజిటివ్‌గానే మాట్లాడింది. ఐతే డైరెక్టర్ మరణం తర్వాత.. సుజిత చేసిన ఓ వీడియో.. మరింత వైరల్ అయింది. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని.. ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చింది రాసుకొచ్చారు. కల్యాణిని మళ్లీ టార్గెట్ చేశారు. ఒకరిని తిడితే తనకి ఏమి వస్తుందని.. జీవితం అనేది చిన్న ప్రయాణం.. ప్రతిక్షణాన్ని ఆనందంగానే గడుపుదాం అని సుజిత వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఎక్కడా కల్యాణి గురించి సుజిత ప్రస్తావించలేదు. కనీసం నిందించినట్లు కూడా కనిపించలేదు. ఐతే కొందరికి మాత్రం ఇది వేరేలా అర్థం అయింది.
కల్యాణిని తిడితే ఏమొస్తుందని సుజిత అన్నట్లు వాళ్లకు వాళ్లు ఫీలయిపోయి.. మళ్లీ ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సూర్యకిరణ్ మరణానికి కల్యాణియే కారణం అని డిసైడ్ చేసేశారు. ఐతే ఇంత జరుగుతున్నా.. కల్యాణి మాత్రం మౌనంగా ఉంది. బయటికి కూడా రాలేదు. రూమర్లు ఎన్ని వచ్చినా.. హుందాగా ప్రవర్తించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కల్యాణి ఏ మాత్రం రియాక్ట్ అయినా.. పరిస్థితి ఇంకోలా ఉండేది. కొత్త వివాదం తయారయ్యేది. సైలెంట్‌గా ఉండి కల్యాణి మంచి పని చేసిందని.. లేదంటే సూర్యకిరణ్ మరణం చుట్టూ మరో కొత్త రచ్చ జరిగేదని చర్చలు మొదలుపెట్టారు నెటిజన్లు.