ఎన్టీఆర్, మహేశ్ పక్కన పెట్టారు… బన్నీ వణికి పోతున్నాడు..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. మూడు సార్లు ఒకర్ని పక్కన పెట్టాడంటే డెఫినెట్ గా సాలిడ్ రీజన్ లేకుండా ఉండదు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 06:30 PMLast Updated on: Feb 11, 2025 | 6:30 PM

Director Tirivikram Future Projects

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. మూడు సార్లు ఒకర్ని పక్కన పెట్టాడంటే డెఫినెట్ గా సాలిడ్ రీజన్ లేకుండా ఉండదు… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఇలానే రెండు సార్లు ఒకర్ని పక్కన పెట్టి, ఆతర్వాత తన దరిదాపుల్లోకి కూడా ఆయన్ని రానీయలేదంటే… డెఫినెట్ గా షాకింగ్ న్యూసే… అలా ఈ ఇద్దరు హీరోలు పక్కన పెట్టింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అనంటారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు,మూడు సార్లు మహేశ్ బాబుతో తనకి చెడిందని కామెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కాస్త ఎగ్రెసీవ్ గానే త్రివిక్రమ్ తో కనెక్షన్ ని నిర్దాక్షిణ్యంగా కట్ చేశాడంటారు. ఇదే నిజమైతే, అలాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా భయపడాల్సిందే… ఆఖరికి అల్లు అర్జున్ కైనా భయం తప్పదు. తన మేకింగ్ లోనే వరుసగా మూడు హిట్లు పడ్డా కాని, పరిస్థితిలో మార్పులేదు. త్రివిక్రమ్ తో సినిమా అయితే ఎనౌైన్స్ చేశాడు కాని, ధైర్యంగా మాత్రం మూవీ చేయలేకపోతున్నాడు. ఎన్టీఆర్, చరణ్ దర్శకుల వెంట పడుతున్నాడు. పాన్ ఇండియా హిట్ పడ్డాక కూడా, తమిల్, హిందీ దర్శకుల ఇంటిచుట్టు ప్రదక్షిణలు చేస్తున్నాడు.. ఎందుకు? అంతగా మాటల మాంత్రికుడిని చూసి భయపడాల్సిన పరిస్థితెందుకొచ్చింది.? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి గొడవల్లేవు. ఉన్నట్టు కూడా ఎన్నడూ చిన్న ప్రచారం కూడా జరగలేదు. కాని ఈ ఇద్దరు హీరోలు ఆ ఒక్క మాటల మాంత్రికుడిని పూర్తిగా అంటే, 99శాతం వరకు పూర్తిగా పక్కన పెట్టారు. లాస్ట్ టైం తనని దగ్గరికి తీసుకుని తప్పు చేశాననే బాధ మహేశ్ లో ఉందని ప్రచారం కూడా జరిగింది.దానికి కారనం కూడా గుంటూరు కారనం రిజల్టే అన్న కామెంట్లు ఉన్నాయి

అసల సంగతి కొస్తే ఎందుకు ఈ బ్లాక్ బస్టర్ల దర్శకుడిని అంత పెద్ద హీరోలు పక్కన పెడుతున్నారనేదే అసలు ప్రశ్న… ఈ క్వశ్చనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు విషయానికొస్తే, జమానాలో తనే త్రివిక్ర్ కి అతడు మూవీతో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అది మహేశ్ మేజ్ ని మార్చటంలో కూడా ఉపయోగపడింది. కాబట్టే తర్వాత ఖలేజా విషయంలో మరోసారి నమ్మితే, అప్పడు ఏడాదిన్నర మూవీ తీసి, అటు ఇటు కాకుండా సగం సగం సంతోషమే దక్కేలా చేశాడట త్రివిక్రమ్

సినిమాను ఓ పద్దతిగా తీయటంలో ఫెల్ అయ్యి, మహేశ్ కి సినిమా చూపించాడని, అలా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం కూడా జరిగింది. తర్వాతే పవన్ కి కనెక్ట్ అయ్యి, అలా పవర్ స్టార్ స్నేహంతో దూసుకెళ్లాడు. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత గుంటూరు కారం ప్రాజెక్ట్ తీసేముందు ఆఫర్ ఇస్తే, రెండు కథలని పట్టాలెక్కించి, చివరికి ఔట్ పుట్ బాలేక మహేశ్ ఆపేసే మనేవరకు సీన్ మారింది.

అతి కష్టం మీద గుంటూరు కారం సగం సగం పనితో పూర్తి చేసి, సగం సగం రిజల్టే వచ్చేలా చేశాడు త్రివిక్రమ్. ఇది ఇండంస్ట్రీ లో చాలా కాలం వినిపించిన మాట. అంతటికీ కారనం తన పనితనంలో నాణ్యత లోపించటం, పవన్ అండ్ కో సినిమాలు ఓకే చేయించటం, అందులో వాట, రీమేక్స్ కథలు రాస్తే అందులో వాటా, ఇలా సైడ్ బిజినెస్ లు ఎక్కువై, మేయిన్ డైరెక్షన్ మీద ఫోకస్ పోయిందన్నారు

ఏదేమైనా ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి హిట్ ఇచ్చాడు. కాని మొండి కత్తి నుంచి 5 రూపాయల ఫ్యాక్షన్ వరకు కాపీ సీన్ల వివాదంతో సినిమా మీద మచ్చ పడటానికి కారణమయ్యాడు. అది నచ్చకే మరో మూవీ చేయబోయి, వద్దనుకున్నాడు. ఆ ప్రాజెక్టే మహేశ్ చేతికెళ్లి, చేతులు కాలేలా చేసిందనే అభిప్రాయముంది. ఇన్ని చూశాక బన్నీకి మాత్రం ధైర్యం ఎలా సరిపోతుంది. తనకి జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి హిట్లు ఇస్తే ఇవ్వొచ్చు కాని, ఇప్పుడేంటనే ప్రశ్నే తలెత్తుతోంది. అసలే పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా హిట్లు, ఇమేజ్ తో మార్కెట్ వచ్చింది. కాబట్టి ఆ ఇమేజ్ కి తగ్గ కథ త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవల్లో రాస్తాడా..? అంత శ్రద్దగా కష్టపడతాడా? ఈ డౌట్లే బన్నీకి పెరిగాయట.

అందుకే అప్పుడెప్పుడో తనతో సినిమా ఎనౌన్స్ చేసినా, మధ్యలో ఆట్లీ అని, లోకేష్ కనకరాజ్ నుంచి ప్రశాంత్ నీల్ వరకు చాలామందితో టచ్ లోకెళ్లాడు. హిందీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని రెండు సార్లు కలిశాడు. ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్న ప్రశాంత్ నీల్ తో రెండు సార్లు, కొరటాల శివ తో ఒక సారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చర్చించాడు. ఇన్ని చేసినా ఎవరూ అందుబాటులో లేకపోయే సరికి, వద్దనుకున్న తమిళ డైరెక్టర్ ఆట్లీనే మళ్లీ లైన్ లో పెడుతున్నాడట బన్నీ… చేతిలో త్రివిక్రమ్ ఉన్నా కాని తనతో మూవీ అంటే భయం వల్లే, బన్నీ ఇలా బయటి చూపులు చూస్తున్నాడనేది సినీ జనాల అభిప్రాయం.