Disha Patani: బాలీవుడ్ పొమ్మంటోంది.. టాలీవుడ్ రమ్మంటోంది.. దిశా పఠాని జాతకం మారనుందా..?
బాలీవుడ్ లో ఆమే ఓ హాట్ లేడీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటించింది.

Disha Patani is pushing with series of offers in South India even though there are no offers in Bollywood
బాలీవుడ్ లో ఆమే ఓ హాట్ లేడీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటించింది. గ్లామర్ రోల్స్ తో ఆడియాన్స్ ని థ్రిల్ చేసింది. అయినా రేంజ్ మారలేదు. ఆఫర్స్ లో జోరు పెరగలేదు. అందుకే ఇప్పుడు ప్లాన్ మార్చింది. బాలీవుడ్ వద్దు సౌత్ ఇండస్ట్రీనే ముద్దు అంటూ కొత్త స్లోగన్ షురూ చేసింది దిశా పటానీ. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన బ్యూటీ. ‘భాఘీ-2’ తో హిట్ కొట్టింది. మలంగ్, రాధే, ఏక్ విలన్ రిటర్స్ సినిమాల్లో నటించి అన్ని కోణాల్లో హైలెట్ అయింది. అయినా కొత్త ఆఫర్స్ అకౌంట్ లో పడటం లేదు. నార్త్ మేకర్స్ తనని పట్టించుకోవడం లేదు. దీంతో ప్లాన్ మార్చిన దిశా ఇప్పుడు సౌత్ మార్కెట్ ని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’లో దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది ఫినిష్ కాకముందే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పింది.
శివ దర్శకత్వంలో సూర్య చేస్తున్న కంగువా లో హీరోయిన్ గా నటిస్తోంది. మైథాలిజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శింబు హీరోగా యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. దేసింగు పేరియసామి తెరకెక్కించే ఈ మూవీ వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో శింబు ద్విపాత్రభినయం చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణెను సెలెక్ట్ చేశారట. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో చివరికి దిశా పటానినీ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలాగే జయం రవి, ఆర్య కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్ . మొత్తానికి బాలీవుడ్ లో గ్లామర్ షో చేసిన దిశా ఇప్పుడు సౌత్ లో జెండా పాతేందుకు క్రేజీ ప్లాన్ నే అప్లై చేస్తోంది.