స్టార్ హీరో విడాకులు బాగా కాస్ట్ లీ.. భరణం ఏకంగా 380 కోట్లు..!

ఈ మధ్య కాలంలో విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 04:20 PMLast Updated on: Feb 27, 2025 | 4:20 PM

Divorce Of The Star Hero Cost A Lot Alimony Is 380 Crores

ఈ మధ్య కాలంలో విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. పాతిక 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న కారణాలతో విడిపోతున్న సెలబ్రెటీస్ ని చూసి ఏమనాలో కూడా తెలియట్లేదు. ఆ మధ్య ధనుష్, ఐశ్వర్య విడిపోయారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా కూడా విడాకులు తీసుకున్నాడు. ఆయనకంటే ముందు క్రికెటర్ చాహల్, ధనుశ్రీ వర్మ విడిపోయారు. ఇక్కడ చాహల్ నుంచి విడిపోవడానికి ఏకంగా 60 కోట్లు భరణంగా తీసుకుంటుంది ధనుశ్రీ. అయితే బాలీవుడ్ లో ఎంతమంది విడిపోయినా కూడా మోస్ట్ కాస్ట్ లీయస్ట్ విడాకులు మాత్రం హృతిక్ రోషన్ కే సొంతం.

కెరీర్ మొదట్లోనే సుస్సానేను పెళ్లి చేసుకున్నాడు హృతిక్ రోషన్. ఇద్దరు కలిసి 14 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళ కాపురంలోకి అనుకోని మనస్పర్ధలు వచ్చాయి. దాంతో 2014లో ఇద్దరు విడిపోయారు. అప్పట్లో వీళ్ళు విడిపోవడానికి కంగనా రనౌత్ కారణం అంటూ సోషల్ మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి. క్రిష్ 3 సినిమా చేస్తున్న సమయంలో హృతిక్, కంగనా మధ్య ఎఫైర్ నడిచిందని.. అందుకే సుసానే విడాకులు తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే భార్యతో విడిపోవడానికి ఏకంగా 380 కోట్ల భరణం హృతిక్ రోషన్ ఇచ్చాడు. నిజానికి భర్తతో విడిపోవడానికి 400 కోట్ల భరణం డిమాండ్ చేసిందని.. చివరికి 380 కోట్లకు ఒప్పించారని తెలుస్తుంది. ఈ మొత్తం విడాకుల కథను పెద్ద పెద్ద పత్రికలు ప్రచురించాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 380 కోట్లు ఇవ్వడానికి హృతిక్ రోషన్ చాలా ఇబ్బంది పడ్డాడని.. అయినా కూడా కచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టు పట్టడంతో చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చాడని ప్రచురించింది. విడాకులు తీసుకున్న కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు వీళ్ళిద్దరూ. ఇక హృతిక్ రోషన్ ఈ మధ్య సింగర్ కమ్ యాక్టర్ సభ ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు. మరోవైపు సుసానే ఖాన్ ప్రముఖ టీవీ నటుడు అలీగోని సోదరుడు అర్సలాన్ గోనితో డేటింగ్ చేస్తుంది. ఇద్దరు ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితుల మాదిరే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఏదేమైనా మీ ఇద్దరి విడాకుల కథ మాత్రం బాగా ఖరీదైనదే.