Animal : నాన్న @ 196 టైమ్స్

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక (Rashmika) హీరోయిన్ (Heroine) గా చేసిన 'యానిమల్' (Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే మాములుగా సినిమాని థియేటర్లలో చూస్తున్నప్పుడు ఏదైన చిన్న తప్పు దొర్లినా ఆడియన్స్ కనిపెట్టేస్తారు.‌ అలాంటిది ఇప్పుడు ఓటీటీలతో ఆడియన్స్ చేతిలోకి సినిమాలు వచ్చినట్టైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 12:32 PMLast Updated on: Jan 29, 2024 | 12:32 PM

Do You Know How Many Times The Word Father Appears In The Movie Animal

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక (Rashmika) హీరోయిన్ (Heroine) గా చేసిన ‘యానిమల్’ (Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే మాములుగా సినిమాని థియేటర్లలో చూస్తున్నప్పుడు ఏదైన చిన్న తప్పు దొర్లినా ఆడియన్స్ కనిపెట్టేస్తారు.‌ అలాంటిది ఇప్పుడు ఓటీటీలతో ఆడియన్స్ చేతిలోకి సినిమాలు వచ్చినట్టైంది.

ప్రతీ చిన్న విషయాన్ని చాలా డీటెయిల్ గా చూస్తూ విశ్లేషణ చేస్తున్నారు ఆడియన్స్. సంవత్సరం క్రితం రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ‘ఆచార్య’ (Acharya) మూవీలో ‘పాదగట్టం’ అనే పదం ఎన్నిసార్లు వచ్చదంటూ అప్పట్లో నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో యానిమల్ మూవీలోని ‘నాన్న’ (Nana) అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయగా.‌. ఆ పదం ఒకటి కాదు రెండు కాదు నలభై కాదు వంద కాదు.. మొత్తంగా 196 సార్లు వచ్చిందంట‌. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఓ నెటిజన్ తన పేజ్ లో షేర్ చేయగా దానికి ‌విపరీతమైన లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

చిన్నతనం నుండి నాన్న అంటే అమితమైన ఇష్టం ఉన్న కొడుకు.. వాళ్ళ నాన్న ప్రతీ పుట్టినరోజుని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రతీసారీ ఏదో గొడవ, అల్లర్లు, లేక వాళ్ళ నాన్న బిజీగా ఉండటమో జరుగుతుంది. ‌మరి చాలా బిజీగా ఉండే నాన్న మీద అంత ఇష్టంతో ఉన్న కొడుకు ఏం చేశాడు.. వాళ్ళ నాన్న ప్రేమని పొందగలిగాడా? లేదా అంటు సాగే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. రష్మిక హీరోయిన్ గా , త్రిప్తి దిమ్రి కీలక పాత్రని పోషించగా నాన్న పాత్రలో అనిల్ కపూర్ కట్టిపడేశాడు. బాబీ డియోల్ విలన్ గా హైలైట్ ఆఫ్ ది మూవీగా నిలిచాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఖాతాలో‌ మరో సినిమా చేరింది. ప్రస్తుతం ‘యానిమల్’ మూవీ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.