చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఈ టైంలో అంత వర్కౌట్ అవుతుందా..!

ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన చిరంజీవి చిరంజీవి కాకుండా పోతాడా చెప్పండి..! ఎన్ని ఫ్లాపులు వచ్చినా అక్కడ ఉన్నది మెగాస్టార్ అనే విషయం మర్చిపోకూడదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 11:13 AMLast Updated on: Apr 15, 2025 | 11:13 AM

Do You Know How Much Chiranjeevis Remuneration Is Does He Work Out So Much During This Time

ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన చిరంజీవి చిరంజీవి కాకుండా పోతాడా చెప్పండి..! ఎన్ని ఫ్లాపులు వచ్చినా అక్కడ ఉన్నది మెగాస్టార్ అనే విషయం మర్చిపోకూడదు. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన సంచలనాలు అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు కదా.. ఈరోజుకు కూడా చిరంజీవికి సరిపోయే సినిమా పడింది అంటే ఈజీగా ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంటాడు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. రెండేళ్ల కింద వచ్చిన వాల్తేరు సినిమాతో ఈ విషయం మరోసారి రుజువైంది. రెగ్యులర్ రొటీన్ కామెడీ యాక్షన్ సినిమాతో ఏకంగా 140 కోట్ల షేర్ వసూలు చేయడమే కాకుండా.. అప్పటివరకు ఉన్న చాలా రికార్డులను తన పేరు రాసుకున్నాడు చిరంజీవి. మెగాస్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా వాల్తేరు వీరయ్య. అందుకే చిరంజీవి సినిమాని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు అంటారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు కూడా ఈయన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా సీనియర్ హీరోల్లో చాలా ముందున్నాడు చిరంజీవి. ఒక్కో సినిమాకు ఈయన 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ట్రాక్ రికార్డు పరంగా చూస్తే ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే చిరంజీవి గత సినిమా భోళాశంకర్ కనీసం 30 కోట్ల కలెక్షన్స్ కూడా తీసుకురాలేదు. దానికి ముందు గాడ్ ఫాదర్ కూడా ఫ్లాపే. ఇంకా మాట్లాడితే 2017 లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన బాస్.. సైరా, ఆచార్య సినిమాలతో వరుస ప్లాపులు ఇచ్చాడు. ఆచార్య అయితే తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. గాడ్ ఫాదర్ కూడా కమర్షియల్ గా డిజాస్టర్. ఒక్క వాల్తేరు వీరయ్య మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ భోళా శంకర్ అదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఒక్కో సినిమాకు 70 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు అంటే రికార్డు అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది.. త్వరలోనే విడుదల కానుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇందులో అనిల్ సినిమాకు చిరంజీవి ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదు. అది తన కూతురు నిర్మిస్తున్న సినిమా.. సుస్మితతో పాటు సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో బిజినెస్ లో మాట తీసుకుంటున్నాడు చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మే తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలు కానుంది. ఆలోపు నానితో ప్యారడైజ్ పూర్తి చేయనున్నాడు శ్రీకాంత్. ఇక ఓదెల సినిమాకు మాత్రం దాదాపు 70 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం శ్రీకాంత్ 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కూడా.. మెగాస్టార్ ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకోవడం ఖాయం. నిర్మాతలు కూడా అంత ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. ఎంతైనా మెగాస్టార్ కదా ఆ మాత్రం డిమాండ్ అలాగే ఉండిపోతుంది. అలాగే ఆయనతో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అని కలలు కనే నిర్మాతలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇది కూడా మెగాస్టార్ కు ప్లస్ అవుతుంది.