Gangavva : గంగవ్వ ఇంటికోసం నాగార్జున ఎంత ఇచ్చారో తెలుసా ?

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు గంగవ్వకు మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. షోలో గంగవ్వ ఉన్నన్ని రోజులూ షోకు కూడా మంచి రేటింగ్‌ వచ్చింది. కేవలం గంగవ్వ కోసమే షో చూసేవాళ్లు కూడా ఉన్నారు అనడంతో ఆశ్చర్యమేమీ లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 04:02 PMLast Updated on: Mar 06, 2023 | 4:02 PM

Do You Know How Much Nagarjuna Helps For Gangavvas House

మై విలేజ్‌ షో (My Village Show) అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా గంగవ్వ (Gangavva) ఎంత ఫేమస్‌ అయ్యారో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. మన ఇంట్లో అమ్మమ్మ లాగా నాయినమ్మలాగా గంగవ్వ మాట్లాడే తీరు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. య్యూటూబ్‌ చూసే ప్రతీ ఒక్కరికీ గంగవ్వ సుపరిచితురాలు. పైకి రావడానికి టాలెంట్‌ ఉంటే చాలు ఏజ్‌తో సంబంధం లేదని గంగవ్వ మరోసారి ప్రూవ్‌ చేశారు. ఫన్నీ వెబ్‌ సిరీస్‌ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న గంగవ్వ.. బిగ్‌బాస్‌ (Bigg Boss) సీజన్‌ 4 ద్వారా మరింత ఫేమస్‌ అయ్యారు.

కానీ చిన్నప్పటి నుంచీ పల్లె వాతావరణానికి అలవాటు పడిన ఆమె.. బిగ్‌బాస్‌ సెట్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. మధ్యలోనే షో నుంచి వెళ్లిపోయారు. రీసెంట్‌గా బిగ్‌బాస్‌ షో గురించి, ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు గంగవ్వ. బిగ్‌ బాస్‌లో 5 వారాల రెమ్యునరేషన్‌గా ఆమెకు 10 లక్షలు ఇచ్చారట. అది కాకుండా ఇల్లు కట్టుకునేందుకు నాగార్జున మరో 7 లక్షలు అదనంగా ఇచ్చారట. బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన డబ్బుతో తాను సొంత ఇల్లు కట్టుకుంటానని గంగవ్వ ప్రోమోలోనే చెప్పారు. కానీ మధ్యలోనే షో నుంచి వచ్చిన కారణంగా ఇల్లు కట్టుకునేందుకు గంగవ్వకు నాగార్జున ఆర్థిక సహాయం చేశారు.

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు గంగవ్వకు మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. షోలో గంగవ్వ ఉన్నన్ని రోజులూ షోకు కూడా మంచి రేటింగ్‌ వచ్చింది. కేవలం గంగవ్వ కోసమే షో చూసేవాళ్లు కూడా ఉన్నారు అనడంతో ఆశ్చర్యమేమీ లేదు. తనకు ఆరోగ్యం అనుకూలించక బయటికి వచ్చాను కానీ.. గేమ్‌లో ఉంటే ఒక్కొక్కరి బయటికి పంపి తాళం వేద్దును అంటూ ఫన్నీగా జోక్స్‌ చేశారు గంగవ్వ.