మహేష్ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగానే తీసుకుంటాడు మహేష్ బాబు. ఈ మధ్య రెమ్యునరేషన్ వద్దు... లాభాల్లో వాటా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2024 | 11:58 AMLast Updated on: Aug 11, 2024 | 11:58 AM

Do You Know Mahesh Babu Properites

సినిమా హీరోల ఆస్తుల గురించి మనం ఎన్నో మాటలు వింటూనే ఉంటాం. వాళ్లకు వందల కోట్ల ఆస్తులు, బంగ్లాలు, స్థలాలు, పొలాలు అంటూ ఎన్నో కామెంట్స్ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. స్టార్ హీరోలకు అయితే వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయనేది అందరికి తెలిసిందే. సినిమా ఫీల్డ్ లో స్టార్ ఇమేజ్ వస్తే ఆస్తులు అంతు లేకుండా పెరిగిపోతూనే ఉంటాయి. సినిమా సినిమాకు వాళ్ళు తీసుకునే పారితోషికం కూడా పెరిగిపోతూనే ఉంటుంది. కలెక్షన్ లు పెరిగితే వాటా కూడా అడుగుతారు హీరోలు. ఈ జాబితాలో మహేష్ బాబు కూడా ఉన్నాడు.

ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగానే తీసుకుంటాడు మహేష్ బాబు. ఈ మధ్య రెమ్యునరేషన్ వద్దు… లాభాల్లో వాటా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది. అలా తీసుకుంటే రెమ్యునరేషన్ కంటే ఎక్కువగానే వస్తుంది మహేష్ కి. మరి ఇంత సంపాదన ఉండే మహేష్ బాబు ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మహేష్ బాబు నికర ఆస్తి విలువ అక్షరాలా 330 కోట్ల రూపాయలు. అలాగే ఆయనకు 7 కోట్ల విలువ చేసే ఒక వ్యాన్ కూడా ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా టైంలో కొనుక్కున్నది.

అప్పట్లో మహేష్ రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. కాని పోకిరి సినిమా తర్వాత మహేష్ ఇమేజ్ బాగా పెరిగింది. అప్పట్లో వరుస హిట్ లు కొట్టడంతో నిర్మాతలకు బంగారు బాతులా మారాడు మహేష్. దీనితో రెమ్యునరేషన్ బాగా పెరిగిపోయింది. శ్రీమంతుడు సినిమా తర్వాతి నుంచి ఇది ఇంకా ఎక్కువైంది. ఇక సేవా కార్యక్రమాల మీద మహేష్ బాబు భారీగానే ఖర్చు పెడుతున్నాడు. బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు మహేష్. అలాగే పిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా చేయిస్తూ ఏటా 30 కోట్లు సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.