చిరంజీవి చంటబ్బాయితో రామ్ చరణ్ పెద్ది సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
చిరంజీవి చంటబ్బాయి ఎక్కడ.. రామ్ చరణ్ పెద్ది సినిమా ఎక్కడ.. ఈ రెండు సినిమాలకు ఎక్కడైనా అసలు పొంతన ఉందా..? పోనీ పోలిక పెట్టుకుందాం అనుకున్న కూడా అదేమో పూర్తిస్థాయి కామెడీ సినిమా..

చిరంజీవి చంటబ్బాయి ఎక్కడ.. రామ్ చరణ్ పెద్ది సినిమా ఎక్కడ.. ఈ రెండు సినిమాలకు ఎక్కడైనా అసలు పొంతన ఉందా..? పోనీ పోలిక పెట్టుకుందాం అనుకున్న కూడా అదేమో పూర్తిస్థాయి కామెడీ సినిమా.. పెద్ది పూర్తిగా రూరల్ యాక్షన్ డ్రామా..! ఈ రెండు సినిమాలకు అసలు ఇంత పోలికైనా ఉందా అనుకోవచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం రామ్ చరణ్, చిరంజీవి సినిమాలకు లింకు కలిసింది. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ షెడ్యూల్ చేసిన బుచ్చిబాబు.. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చి ఏప్రిల్ మూడో వారం నుంచి మళ్లీ లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 నవంబర్ నాటికి పూర్తి చేయాలి అనేది బుచ్చిబాబు ప్లాన్. అలా చేస్తే గాని రెండు నెలలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు చేసి.. మరో నెల రోజులు ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి కావాల్సిందే.. బుచ్చిబాబుకు మరో ఆప్షన్ కూడా లేదు. మరోవైపు రామ్ చరణ్ కూడా పెద్ది పూర్తయ్యే వరకు పూర్తిగా ఈ సినిమా మీదే ఫోకస్ చేయనున్నాడు. ఈ సినిమాను మార్చి 27, 2026న విడుదల చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఆరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు. 2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పటి వరకు ఒకసారి కూడా బర్త్ డే రోజు సినిమా విడుదల చేయలేదు. ఫస్ట్ టైమ్ బుచ్చిబాబు అది చేయాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది చరణ్ అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది చంటబ్బాయి సినిమాతో రామ్ చరణ్ కు ఏంటి లింక్ అనే అనుమానం మీకు వస్తుంది కదా. అక్కడికే వస్తున్నాం..
చిరంజీవి 47 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఆయన పుట్టిన రోజు నాడు విడుదలైన సినిమా ఒకటి మాత్రమే ఉంది. అదే చంటబ్బాయి.. లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమా 1986 ఆగస్టు 22న విడుదలైంది. అప్పట్లో సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ.. చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది చంటబ్బాయి. మళ్లీ ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు నాడు పెద్ది సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో కచ్చితంగా తన కెరీర్లో గుర్తుండిపోయే విజయం అందుకుంటాను అని నమ్మకంగా చెబుతున్నాడు మెగా వారసుడు. అంతేకాదు ఈ సినిమా కోసం చరణ్ నువ్వు చాలా మేకోవర్ చేశాడు బుచ్చిబాబు. మరి చిరంజీవి కెరీర్ మాదిరే చరణ్ కు కూడా పెద్ది గుర్తుండిపోయే సినిమా అవుతుందో లేదో చూడాలి.