Naga Chaitanya : నాగ చైతన్య కి ఖాళీ టైమ్ ఎక్కువ ఏం చేశాడో తెలుసా!

నాగచైతన్య ఉన్నట్టుండి అంత మాట అనేశాడేంటి? హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టాడు.. ఇంకా ఖాళీ టైమ్ ఎక్కడ దొరుకుతోంది అసలు? ఇంతకీ ఆ టైమ్ లో ఏం చేశానని చెప్పాడో తెలుసా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 04:48 PMLast Updated on: Nov 20, 2023 | 4:48 PM

Do You Know What Naga Chaitanya Did In His Free Time

నాగచైతన్య ఉన్నట్టుండి అంత మాట అనేశాడేంటి? హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టాడు.. ఇంకా ఖాళీ టైమ్ ఎక్కడ దొరుకుతోంది అసలు? ఇంతకీ ఆ టైమ్ లో ఏం చేశానని చెప్పాడో తెలుసా?

రీసెంట్ గా ‘కస్టడీ’ మూవీతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు. మరోవైపు తన 23వ సినిమాని చందు మొండేటితో ప్లాన్ చేసుకున్నాడు. ‘షోయూ’ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టాడు. ఈ హడావుడే సరిపోతుంది అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఇదే విషయాన్ని చైతు స్వయంగా రివీల్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోని పోస్ట్ చేశారు. అప్పట్లో ఏవో ఇంటర్యూలు, సినిమా ఫంక్షన్ల సమయంలోనే సెలబ్రెటీలు కనిపించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీలు చాలా హుషారుగా ఉంటున్నారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అప్డేట్స్ అందిస్తున్నారు. అయితే యూట్యూబ్ ఛానల్స్ ని ఎక్కువగా సీరియల్ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు రన్ చేసేవారు. కానీ ఈ లిస్టులో కొత్తగా చేరాడు అక్కినేని వారబ్బాయ్ నాగచైతన్య.

TRISHA: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన నితిన్.. మహిళా కమిషన్ నోటీసులు..

తన పేరుతో యూట్యూబ్ ఛానల్ రూపొందించి అందులో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను కూడా యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టానంటూ చెప్పుకొచ్చాడు. ఇదే టైమ్ లో ఫ్యాన్స్ తో కాసేపు చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ అడిగిన క్వశ్చన్ కి ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చాడు చైతూ. ‘జుట్టు గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా?’ అని ఓ నెటిజన్ అడిగితే.. ఆరు నెలలుగా జాబ్ లేదు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను అందుకే పనేం లేక జుట్టు గడ్డం పెంచానంటూ సరదాగా ఆన్సరిచ్చాడు. కాసేపటి తర్వాత ఈ లుక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చందు మొండేటి మూవీ కోసం అని క్లారిటీ ఇచ్చాడు.

మజిలీ మూవీ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ఆ తర్వాత నటించిన థాంక్ యూ, కస్టడీ తీవ్రంగా నిరాశపర్చాయి. శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ సక్సెస్ అయినా ఆశించిన రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు చందు మొండేటి సినిమాతో పాటు అనిల్ రావిపూడి తోనూ ఓ మూవీకి కమిటయ్యాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం, ఇంకోవైపు యూ ట్యూబ్ చానెల్ తో అక్కినేని వారబ్బాయ్ బిజీ బిజీ అన్నమాట.