రామ్ చరణ్, సుకుమార్ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసా.. మామూలుగా ఉండదు..!
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బుచ్చిబాబు RC16 షూట్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం చాలా మేకోవర్ రామ్ చరణ్.

రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బుచ్చిబాబు RC16 షూట్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం చాలా మేకోవర్ రామ్ చరణ్. బరువు కూడా పెరిగాడు. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సెప్టెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి.. డిసెంబర్లో విడుదల చేయాలంటే చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు మెగా వారసుడు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ నేపథ్యంలో బుచ్చిబాబు సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు రామ్ చరణ్. డిజాస్టర్ ఇచ్చిన సంవత్సరంలోనే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వాలని చూస్తున్నాడు మెగా హీరో. దానికోసమే చాలా వేగంగా పని చేస్తున్నాడు. ఇప్పటినుంచి సినిమా సినిమాకు గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయాడు రామ్ చరణ్.
అందుకే దీని తర్వాత సుకుమార్ సినిమా కమిట్ అయ్యాడు ఈ హీరో. నిజానికి పుష్ప పనుల్లో ఉండి రాంచరణ్ కథ ఇప్పటివరకు సిద్ధం చేయలేదు సుకుమార్. కానీ ఈయన కోసం అదిరిపోయే బ్యాక్ డ్రాప్ సిద్ధం చేస్తున్నాడు లెక్కల మాస్టారు. త్రిబుల్ ఆర్ లో ప్రీ ఇండిపెండెన్స్ కథ చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో కూడా 1950స్ నేపథ్యం ఉంటుందని తెలుస్తుంది. తాజాగా సుకుమార్ సినిమా కథ స్వతంత్ర్య సమయంలో జరిగిన రజాకార్ పోరాట నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. నిజానికి రజాకార్ నేపథ్యం గురించి చాలా రోజులుగా సుకుమార్ చెబుతూనే ఉన్నాడు. ఆ మధ్య విజయ్ దేవరకొండతో ఈ నేపథ్యంలో ఒక కథ చేద్దామని కూడా ఆలోచించాడు. అయితే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ తో రజాకార్ నేపథ్యంలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే రామ్ చరణ్, సుకుమార్ సినిమా వస్తే అంతకంటే సంచలనం మరొకటి లేదు. అన్నట్టు ఈ మధ్యే రజాకార్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. దానికి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.