విజయ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా.. అయితే ఈ కథ తెలియాలి..!
హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. దాన్ని వదిలేసి రాజకీయాలకు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తెలుగులో పవన్ కళ్యాణ్ అది చేసి చూపించాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన జెండా పాతాడు.

హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. దాన్ని వదిలేసి రాజకీయాలకు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తెలుగులో పవన్ కళ్యాణ్ అది చేసి చూపించాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన జెండా పాతాడు. తమిళంలో కూడా విజయ్ ఇదే చేస్తున్నాడు. కెరీర్ పీక్ లో ఉన్నపుడే రాజకీయాల వైపు వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చివరి సినిమా షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత పొరపాటున కూడా సినిమాల వైపు వెళ్ళను అంటున్నాడు విజయ్. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం ఉన్నట్టుండి తీసుకున్నది ఏమీ కాదు. మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా అభిమాన సంఘాల నాయకులతో కలుస్తూనే ఉన్నాడు విజయ్. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలి.. ప్రణాళికలు ఎలా ఉండాలి.. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలను అభిమానులతో కూర్చొని ఆయన ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాడు.
ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఎలా మారుతాయి.. ప్రజలు సపోర్ట్ చేస్తారా లేదా.. అనే ఎన్నో ప్రశ్నలు కూడా ఆయన తలలో తానే అంతర్మదనం చేసుకున్న తర్వాతే రాజకీయ అరంగేట్రం చేశాడు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరో కూడా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వద్దు అని వెనకడుగు వేశాడు. అలాగే కమల్ హాసన్ ఒక్క సీటు కూడా గెలవకుండా అవమానం పాలయ్యాడు. ఈ సందర్భంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తమిళ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్. అక్కడ అభిమానులు కూడా హార్డ్ కోర్ ఉంటారు.
తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా లెక్క చేయని అభిమానం వాళ్ళ సొంతం. అందుకే సినిమా వాళ్లకు రాజకీయాలలో ఎక్కడా లేనంత సక్సెస్ రేట్ తమిళనాడులో ఉంది. మన దగ్గర కేవలం ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల నుంచి వెళ్లి సక్సెస్ అయ్యారు. చిరంజీవి ప్రభావం చూపించినా కూడా గెలవలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. కానీ తమిళనాట అన్నాదొరై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్ ఇలా చాలామంది సినిమా వాళ్లు రాజకీయాలలో చక్రం తిప్పారు. అదే నమ్మకం ఇప్పుడు విజయ్ లో కూడా కనిపిస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను కూడా టార్గెట్ చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ లా ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు చేయొచ్చు కదా అన్నా కూడా.. ఆయన మాత్రం లేదు.. ఏదో ఒక పడవ మీద మాత్రమే కాళ్లు పెడతాను అంటున్నాడు. పైగా విజయ్ పొలిటికల్ కెరీర్ కు ప్రశాంత్ కిషోర్ అండగా ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో కచ్చితంగా విజయ్ జెండా పాతడం ఖాయం అంటున్నాడు ఆయన.