దేవర రెమ్యునరేషన్ తో పది 50 ఫ్యామీలల లైఫ్ సెట్…?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై పెద్ద చర్చే జరుగుతోంది. సినిమాలు పాన్ ఇండియా కాబట్టి స్టార్ హీరోలు ఏ విధంగా కూడా తగ్గడం లేదనే మాట వాస్తవం. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా పేరుతో కోట్లు వసూళ్లు చేస్తుంటే ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఎంత వసూలు చేయవచ్చు...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2024 | 06:06 PMLast Updated on: Oct 09, 2024 | 6:06 PM

Do You Ntr Remunaration For Devara Movie

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై పెద్ద చర్చే జరుగుతోంది. సినిమాలు పాన్ ఇండియా కాబట్టి స్టార్ హీరోలు ఏ విధంగా కూడా తగ్గడం లేదనే మాట వాస్తవం. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా పేరుతో కోట్లు వసూళ్లు చేస్తుంటే ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఎంత వసూలు చేయవచ్చు…? దేవర సినిమాకు అసలు ఎన్టీఆర్ ఎంత తీసుకుని ఉండవచ్చు…? ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది. దేవర సినిమా విషయంలో తారక్… ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

సినిమా ఫ్లాప్ అని ఎంత మంది నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా దేవర జాతర మాత్రం ఆగలేదు. 500 కోట్ల వసూళ్లు ఇప్పటికే ధాటి కొత్త రికార్డులు నమోదు చేసే దిశగా వెళ్తోంది. మరో రెండు మూడు రోజులు దేవర హవా ఇలాగే కొనసాగేలా కనపడుతోంది. దేవర సినిమాకు ఎదురెళ్ళే సినిమాలు ఏవీ లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా ఉన్నా కూడా ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. దేవర విదేశాల్లో కూడా ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచ్చింది.

అయితే దేవర సినిమాకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ ఈ సినిమాకు 45 కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో కొంత వాటా తీసుకున్నాడని టాక్. సినిమాకు ఊహించని విధంగా లాభాలు రావడంతో కళ్యాణ్ రామ్ స్వయంగా ఎన్టీఆర్ కు మరో 10 కోట్లు ఎక్కువే ఇచ్చాడని టాక్. అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ 13 కోట్ల వరకు తీసుకున్నాడు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ 3.5 కోట్లు తీసుకుంది. అలాగే ప్రకాష్ రాజ్ ఈ సినిమా 1.5 కోట్లు తీసుకున్నట్టు సమాచ్చారం.

అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ 50 లక్షలు తీసుకోగా మురళీ శర్మ 40 లక్షలు తీసుకున్నాడు. ఇలా కీలక నటులు అందరూ ఈ సినిమాతో సాటిస్ఫై అయ్యారట. సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఇదిలా ఉంచితే దేవర 2 సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కొంత షూట్ కూడా పూర్తి చేసారు. మరో నాలుగు నెలలు సీరియస్ గా షూట్ చేస్తే దేవర 2 ని విడుదల చేయడం పెద్ద మేటర్ కాదు అంటున్నారు. దేవర 2లో ఒక పాట కూడా షూట్ చేసారట. యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట.