ఈ ఒక్కడి మీద నమ్మకం లేదా… 1000 కోట్ల భయం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప లాంటి రెండు హిట్లు పడ్డా, దర్శకుల కరువొచ్చింది. ముంబైకి, హైద్రబాద్ కి ఇలా ప్రతీ రెండు వారాలకోసారి విమానాల్లో చక్కర్లు కొడుతున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప లాంటి రెండు హిట్లు పడ్డా, దర్శకుల కరువొచ్చింది. ముంబైకి, హైద్రబాద్ కి ఇలా ప్రతీ రెండు వారాలకోసారి విమానాల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఓ సారి సంజయ్ లీలా భన్సాలిని కలిశాడు. ఈసారి ఆట్లీని ముంబైలో మూడో సారి కలిసొచ్చాడు. అంతా తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసమే.. ఒక వైపు ప్రశాంత్ నీల్ లో సినిమా కోసం దిల్ రాజుని రంగంలోకి దింపిన బన్నీ, అదే ప్రొడ్యూసర్ తో ఆట్లీ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకనో కాని ఏది వర్కవుట్ కావట్లేదు. అదేదో ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చిన హీరోకి ఎదురైన అన్నీ కష్టాలు తనకే ఎదురౌతున్నాయి. తనొక్కడి మీద ఆట్లీకి నమ్మకం లేకే, మరో హీరోని రంగంలోకి దింపుతున్నాడనే ప్రచారం జరుగుతున్న టైంలో, బన్నీకి సినిమా కష్టాలు మొదలయ్యాయని, దిల్ రాజు పరోక్షంగా తేలుస్తున్నాడు. అదెలానో చూసేయండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆట్లీమూవీ ముందు ఓకే అయ్యి, తర్వాత డ్రాప్ అయ్యింది. తర్వాత సన్ పిక్ఛర్స్ కండీషన్స్ కి బన్నీ ఓకే చెప్పటంతో ఫైనలైందన్నారు. కట్ చేస్తే బన్నీ మాత్రం హైద్రబాద్ టు ముంబై ట్రిప్పులు మీద ట్రిప్పులు కొడుతున్నాయి.కారణం అక్కడే ఆట్లీ తన టీం తో బన్నీ సినిమా పనులుచూడటం. సన్ పిక్చర్స్ కూడా ఈ మూవీని సైడ్ ట్రాక్ చేసేలా ఉండటంతో, దిల్ రాజుని రంగంలోకి దింపిన బన్నీ, మొత్తానికి కొత్త హీరో లా కష్టపడాల్సి వస్తోంది.
పుష్ప రెండు భాగాలు పాన్ ఇండియా లెవల్లో హిట్టయ్యాయి. అయినా బన్నీకి అందుబాటులో ఒక్క పాన్ ఇండియా డైరెక్టర్ లేడు. త్రివిక్రమ్ తో సినిమా కమిటైనా, తనమీద నమ్మకంలేదనే కామెంట్లు పెరిగాయి. ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ ని బన్నీతో సినిమాకు ఒప్పించే పనిపెట్టుకున్న దిల్ రాజు, ప్రజెంట్ ఆట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.సరే దిల్ రాజు ఇప్పుడు ఆట్లీతో బన్నీ మూవీని, అల్లు అర్జున్ తో ప్రశాంత్ సినిమాని ప్లాన్ చేస్తే, అంత బడ్జెన్ ని తట్టుకుంటాడా? గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాప్ పడ్డాక కోలుకోవటమే కష్టమనుకున్న ఈ నిర్మాత మరో రెండు పెద్ద రిస్క్ లు చేస్తాడా? ఈడౌట్లకు ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుందో కాని, బన్నీకి సినిమా కష్టాలు తప్పట్లేదు.
మొన్నామధ్య బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని కలిశాడు. తనని ఇలా కలవటం ఇది మూడోసారి. పుష్ప లాంటి హిట్ పడ్డాక పాన్ ఇండియా మార్కెట్ ని కాపాడుకోవాలంటే కత్తిలాంటి కథ, దాన్ని తీసే దర్శకుడు కావాలి. వాళ్లే దొరక్క తికమకపడుతున్నట్టున్నాడు బన్నీ. తనే నిర్మాత అయినట్టు ఆట్లీ మూవీని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా పుష్ప2 హిట్టైనా సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తో తనకి కష్టాలు, కామెంట్లు తప్పలేదు. ఇక రెండు పాన్ ఇండియా హిట్ పడ్డా తర్వాత మూవీ కి దర్శకుల్లేక, తనకి తికమక తప్పట్లేదు.