Shahrukh Khan: షారూఖ్ ఖాన్‌కు ప్రమాదం!
షారూక్‌ఖాన్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కింగ్ ఖాన్.. ప్రమాదానికి గురైనట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

Doctors operated on Shah Rukh Khan after he suffered a nose injury during the shooting in Los Angeles, USA and was bleeding profusely
ఈ మధ్యే ఓ మూవీ షూటింగ్ కోసం.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లిన షారూఖ్ కాన్.. అక్కడ ప్రమాదానికి గురయ్యాడు. దీని తర్వాత అతను అక్కడ శస్త్రచికిత్స కూడా చేయించుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. ముక్కులో గాయం కారణంగా షారూక్‌కు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతనికి చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. షారూఖ్‌ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో.. ఒక ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలోఈ ప్రమాదం జరిగింది. అతన్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు ఆయన బృందానికి చెప్పారు.
ఆపరేషన్ తర్వాత షారుక్ కట్టుతో కనిపించారు. షారుక్ ఇప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నాడు. షారుక్ ఈ సంవత్సరం పఠాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విడుదలైన ప్రతిచోటా చాలా సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం జవాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ నెలలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. జూలై 12న ట్రైలర్‌ని విడుదల చేయొచ్చు. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. దీనిని షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, గౌరీ ఖాన్ నిర్మించారు. షారుఖ్‌కి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్తంలోని డాంకీ కూడా ఉంది. ఇందులో విక్కీ కౌశల్, తాప్సీ పన్ను కూడా నటించారు.