బామ్మర్ది నడుము గిల్లేసిన బావ.. నార్నె నితిన్ పై జూనియర్ ఎన్టీఆర్ కు అంత ప్రేమ ఉందా..?
జూనియర్ ఎన్టీఆర్ పైకి కనిపించేంత సైలెంట్ కాదు అని ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. బయట చాలా రిజర్వడ్ గా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం మహా అల్లరి చేస్తాడు.

జూనియర్ ఎన్టీఆర్ పైకి కనిపించేంత సైలెంట్ కాదు అని ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. బయట చాలా రిజర్వడ్ గా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం మహా అల్లరి చేస్తాడు. తనకు కావాల్సిన వాళ్లతో ఎన్టీఆర్ ఎంత చిలిపిగా ఉంటాడు అనేది మనం చాలా సార్లు చూసాం. రాజమౌళి, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఎన్టీఆర్ లోని మరో మనిషి బయటకు వస్తాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సంబరాల్లో కూడా ఆ చిలిపి ఎన్టీఆర్ మళ్ళీ బయటికి వచ్చాడు. అక్కడ అందరూ దాదాపు ఎన్టీఆర్ కంటే చిన్నవాళ్లే. దాంతో హుందాగా కనిపించాలి. దాన్ని చాలా వరకు మేనేజ్ చేశాడు ఎన్టీఆర్. పెద్దరికం ప్రదర్శిస్తూ అందరికీ ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. దానికి తోడు ఆయన బావమరిది నార్నే నితిన్ ఇందులో హీరో. స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా చాలా సేపు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాడు జూనియర్.
కేవలం నటీనటుల గురించి మాత్రమే కాదు.. టెక్నికల్ టీంను కూడా గుర్తుపెట్టుకుని ప్రశంసించాడు. చాలావరకు హుందాగానే స్పీచ్ ఇచ్చిన ఎన్టీఆర్.. మధ్య మధ్యలో నాగ వంశీ, నిర్మాత చిన్న బాబుల మీద సెటైర్లు పేల్చాడు. అలాగే తన బావమరిది నితిన్ గురించి చెబుతూ చాలా సరదాగా మాట్లాడాడు ఎన్టీఆర్. తన పెళ్లి అయినప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడని.. తన దగ్గర అసలు మాట్లాడేవాడు కాదు అంటూ గుర్తు చేసుకున్నాడు ఎన్టీఆర్. వీడేంటి అసలు నాతో మాట్లాడడు అని చాలాసార్లు అనుకున్నానని.. మొదటిసారి ధైర్యం చేసి నేను యాక్టర్ అవుతాను బావ అని నా దగ్గరికి వచ్చి చెప్పాడని తెలిపాడు ఎన్టీఆర్. సరే మంచిది నీ చావు నువ్వు చావు.. నేను మాత్రం నీకు హెల్ప్ చేయను అని చెప్పినట్టు ఎన్టీఆర్ తెలిపాడు. ఈరోజు బామ్మర్ది సక్సెస్ చూసి బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
సినిమా సినిమాకు నితిన్ గ్రోత్ చూసి తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఎన్టీఆర్. అక్కడితో అయిపోలేదు.. అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. షీల్డ్ ఇచ్చే సమయంలో నార్నే నితిన్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు.. బామ్మర్దితో సరదాగా గిల్లికజ్జాలు ఆడాడు ఎన్టీఆర్. షీల్డ్ ఇస్తూ నితిన్ ను గట్టిగా గిల్లేసాడు. దాంతో నితిన్ నవ్వుతూ అలా పక్కకు వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద బావ బామ్మర్ది మధ్య ఈ సీన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు టీవీలో చూసినవాళ్ళు కూడా నవ్వుకున్నారు. నార్నే నితిన్ ఇప్పటివరకు బయట సరిగ్గా ఓపెన్ అయింది లేదు. ఎన్టీఆర్ గురించి కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడడు. ఎవరైనా అడిగితే కానీ బావగారి గురించి చెప్పడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా నితిన్ గురించి ఇప్పటివరకు ఎక్కడ బయట మాట్లాడింది లేదు. నిజంగా ఇద్దరి మధ్య ఇంత సరదా ఉందా.. బామ్మర్ది తో ఎన్టీఆర్ ఎంత జోవియల్ గా ఉంటాడా అని ఆశ్చర్యపోయారంతా. ఎంతైనా బామ్మర్ది కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది.. కాకపోతే అది బయట చూపించే సమయం ఎప్పుడు రాలేదు.. ఇప్పుడొచ్చింది చాన్స్ వదులుకోలేదు.