ఎన్టీఆర్ కు ‘మనదేశం’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
నటరత్న ఎన్టీఆర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన నిర్మాత, నటి కృష్ణవేణి వయోభారంతో కన్నుమూశారు. నిర్మాతగా నటిగా, గాయనిగా ఆమె సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించారు.

నటరత్న ఎన్టీఆర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన నిర్మాత, నటి కృష్ణవేణి వయోభారంతో కన్నుమూశారు. నిర్మాతగా నటిగా, గాయనిగా ఆమె సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించారు. ఇక ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతగా ఈ విషయంలో కృష్ణవేణి ఎంతో సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ అభినయానికి ఆయనకు అప్పట్లోనే భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారు కృష్ణవేణి. ఇక విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా దర్శకుడు ఎల్ వి ప్రసాద్ సినిమాకు తగిన నటీనటుల అన్వేషణ కోసం చాలా నాటకాలు చూసేవారు. ఆ సమయంలోనే విజయవాడలో ఎన్టీఆర్ చేసిన ఓ నాటకం చూశారు. అప్పుడే ఎన్టీఆర్లో గొప్ప నటుడున్నాడని గ్రహించిన ప్రసాద్.. అప్పటినుంచి ఆయనను ప్రోత్సహించారని చెప్తారు. సినిమా పరిశ్రమకు రావాలని ఆహ్వానించారట. రామారావు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం.. ఆ తర్వాత అక్కడ వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి. అప్పుడు మద్రాసు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్.
అప్పటికే మన దేశం షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజావారి సతీమణి కృష్ణవేణి నిర్మించి హీరోయిన్ గా కూడా నటించారు. ఇక మన దేశం సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన ఆయనకు 250 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు కృష్ణవేణి. అప్పట్లో ఆ రెమ్యూనరేషన్ ఒక సంచలనం. అత్యధిక పారితోషికంగా కూడా సౌత్ ఇండియాలో చెపుతూ ఉండేవారు. ఇక అందుకే కృష్ణవేణిది లక్కీ అండ్ అని కూడా అప్పటి సినీ జనం మాట్లాడే వారు.
చిత్తూరు నాగయ్య సిహెచ్ నారాయణరావు అప్పటికే పేరు ఉన్న వారితో.. కలిసి రామారావు వంటి కొత్త నటుడు ఎలా నటిస్తారో అనుకున్న జనాలకు.. ఎన్టీఆర్ ఏ మాత్రం భయపడకుండా నటించారు. ఇక ఎన్టీఆర్ ఆ ప్రతిభతోనే అగ్ర హీరోగా మారిపోయారని కృష్ణవేణి పదేపదే చెప్తూ ఉండేవారు. ఇక మన దేశం సినిమాకు ఘంటసాల సంగీతం అందించారు. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనంలో విశేషంగా వినపడేవి. తర్వాత రోజుల్లో దర్శకుడుగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశరావు.. ఈ సినిమాలో బిట్ రోల్ లో నటించారు. ఇలా పలు విశేషాలతో ఈ సినిమా వచ్చింది. 1949 నవంబర్ 24న విడుదలైన ఈ సినిమా ఓ బెంగాలీ సినిమా నుంచి తీసుకున్నట్లు సమాచారం. ఆ కథకు ఎల్వి ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా సముద్రాల సీనియర్.. మాటలు, పాటలు పలికించి ఆకట్టుకున్నారు. కృష్ణవేణి మృతితో సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.