Rashmika: పుష్ప-2 నుంచి అలిగి వెళ్లిపోయిన రష్మిక ?

సినిమా విషయంలో బన్నీ ఎంత క్రమశిక్షణతో ఉంటాడో ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఫంక్షన్స్‌లో చెప్పారు. అలాంటి వ్యక్తి హీరోయిన్‌ను కామెంట్‌ చేయడం.. రష్మిక అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇందులో ఏదైనా నమ్మేలా ఉన్నాయా అంటూ ఉమైర్‌ను ఆడుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2023 | 11:55 AMLast Updated on: Mar 18, 2023 | 11:55 AM

Does Rashmika Left From Pushpa 2 Sets

పుష్ప-2 షూటింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే రీసెంట్‌గా మూవీ షూటింగ్‌ నుంచి రష్మిక అలిగి వెళ్లిపోయిందన్న గాసిప్ ఇప్పుడు నెట్టింట హల్చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు బీటౌన్‌లో బాగా ఫేమస్‌. సినిమా రివ్యూలతో రెగ్యులర్‌గా సెలబ్రెటీలను టార్గెట్‌ చేస్తుంటాడు. కేవలం సినిమాలే కాదు. వాళ్ల వ్యక్తిగత విషయాలపై కూడా సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు రష్మిక అలిగి వెళ్లిపోయిందన్న వార్త కూడా ఉమైరే ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. పుష్ప-2 షూటింగ్‌లో అల్లు అర్జున్‌ రష్మికను టీస్‌ చేస్తున్నాడట. ఈ విషయంలో అలిగిన రష్మిక వెంటనే సెట్స్‌ నుంచి వెళ్లింపోయిందట. బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు ఉమైర్‌. అయితే ఉమైర్‌ చేసిన ఈ ట్వీట్‌తో నెటిజెన్స్‌ అతన్ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఎప్పుడూ ఎందుకు సెలబ్రెటీస్‌ మీద పడి చస్తావంటూ చీవాట్లు పెడుతున్నారు. ఇది కాకుండా వేరే పని లేదా అంటూ క్లాస్‌ తీసుకుంటున్నారు. కాంట్రవర్సీ కాకుండా కొత్తది ఏదైనా ట్రై చెయ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌లో తెలియకపోయినా బన్నీ, రష్మిక ఫ్రెండ్‌షిప్‌ గురించి టాలీవుడ్‌లో చాలా మందికి తెలుసు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇక సినిమా విషయంలో బన్నీ ఎంత క్రమశిక్షణతో ఉంటాడో ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఫంక్షన్స్‌లో చెప్పారు. అలాంటి వ్యక్తి హీరోయిన్‌ను కామెంట్‌ చేయడం.. రష్మిక అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇందులో ఏదైనా నమ్మేలా ఉన్నాయా అంటూ ఉమైర్‌ను ఆడుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్‌.