పిల్లల ఫోటోలు తీయొద్దు.. రెచ్చిపోయిన కరీనా కపూర్

ప్రముఖుల పిల్లల విషయంలో మీడియాలో జరిగే హడావుడి అంతా కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీడియా ఫోకస్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఫోటోలను వైరల్ చేయడానికి మీడియా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 02:05 PMLast Updated on: Feb 18, 2025 | 2:05 PM

Dont Take Pictures Of Children Kareena Kapoor Is Upset

ప్రముఖుల పిల్లల విషయంలో మీడియాలో జరిగే హడావుడి అంతా కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీడియా ఫోకస్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఫోటోలను వైరల్ చేయడానికి మీడియా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. తమ వ్యూస్ కోసం ప్రైవసీ విషయంలో కూడా సెలబ్రిటీస్ ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ అక్కడ మీడియా ప్రతినిధులపై సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఒక మహిళా జర్నలిస్టు పదేపదే తన పిల్లల ఫోటోలు తీయడంపై విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యాడు.

దీనిపై ఆస్ట్రేలియా మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక లేటెస్ట్ గా దీనిపై కరీనా కపూర్ కూడా అసహనం వ్యక్తం చేసింది. తన పిల్లల ఫోటోలను పదేపదే తీయటంపై రియాక్ట్ అయిన కరీనాకపూర్ మీడియా వాళ్ళపై ఫైర్ అయిపోయింది. గత నెల ఇంట్లోనే తన భర్త సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన తర్వాత.. తన కుటుంబ సభ్యుల ప్రైవసీ పై కరీనాకపూర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక లేటెస్ట్ గా పిల్లలతో కలిసి తన తండ్రి రణధీర్ కపూర్ బర్తడే వేడుకలకు వెళ్ళగానే ఫోటోగ్రాఫర్లు కొన్ని ఫోటోలు తీశారు.

దీనితో ఆమె అక్కడే సీరియస్ అయింది. తన ఫోటోలు తీసుకోవాలని పిల్లలవి వద్దని చెప్పింది. గతంలో ఈ విషయం అందరికీ చెప్పినట్లు ఆమె వాళ్ళకు గుర్తు చేసింది. తన పిల్లల ప్రైవసీకి కలిగించద్దని… ఇటువంటివి చిరాకుగా ఉంటాయని.. అర్థం చేసుకుని ఫోటోలు తీయడం ఆపాలని రిక్వెస్ట్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి బాలీవుడ్ జనాలను కంగారు పెట్టింది. అతని ఇంట్లోకి వెళ్లి దాడి చేశాడు నిందితుడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. అభిమానులకు డాక్టర్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇక భద్రత విషయంలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరిని తమ ఇంట్లోకి రానీయడం లేదట. అభిమానులను కూడా వచ్చి కలవద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సైఫ్ అలీఖాన్ ఇంటికి భద్రతను పెంచింది. అయితే దాడి చేసిన వ్యక్తి ఎందుకు చేశాడనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై పోలీసులు సాక్షాలను కూడా సేకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు అతనే దాడి చేశాడనే క్లారిటీ కూడా పోలీసులకు లేదని వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే వెళ్లాలని సైఫ్ కుటుంబం నిర్ణయం తీసుకుంది. కాగా సైఫ్ అలీ ఖాన్… దేవర సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.