DOP Senthil Kumar: టాలీవుడ్‌లో మరో విషాదం.. సెంథిల్ భార్య మృతి.. కారణం ఏంటంటే..
సెంథిల్ కుమార్, రూహీ 2009లో పెళ్లి చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా ట్రైనర్. ఆమె చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. కోవిడ్ నుంచి రూహీకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయ్.

DOP Senthil Kumar: బాహుబలితో పాటు దాదాపు రాజమౌళి సినిమాలన్నింటికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య రూహీ.. ఆకస్మికంగా చనిపోయింది. దీంతో సెంథిల్‌తో పాటు అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయింది. సెంథిల్ కుమార్ భార్య యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. కొద్దికాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Rajadhani Files Review: ఆవేదనకి సాక్ష్యం.. రాజధాని ఫైల్స్.. రైతుల కన్నీటి గాథ
అనారోగ్యానికి గురైన ఆమెకు ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి చనిపోయారు. ఆమె మరణంతో సెంథిల్ కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. సెంథిల్ కుమార్, రూహీ 2009లో పెళ్లి చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా ట్రైనర్. ఆమె చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. కోవిడ్ నుంచి రూహీకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయ్. అప్పటినుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఆరోగ్యం విషమించడంతో.. ఆమె ప్రాణాలు వదిలారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రూహీ అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయ్. సెంథిల్ కుమార్‌కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. కొంత మంది స్నేహితులు, సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
సెంథిల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డీవోపీగా పనిచేశారు. ఇక ఆయన వర్క్‌కు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే సెంథిల్.. ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదం అంటూ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.